iDreamPost
android-app
ios-app

నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. సైకోలను మించిపోయారు!

నడి రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. సైకోలను మించిపోయారు!

నేటి కాలంలో యువత వ్యసనాలకు బానిసై తప్పుదోవ పడుతోంది. మద్యం, జూదం, డ్రగ్స్‌ అంటూ జీవితాల్ని నాశనం చేసుకుంటోంది. బెట్టింగ్‌ల కారణంగా అప్పులపాలై నిత్యం ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మందు, డ్రగ్స్‌ కారణంగా నిత్యం ఎవరో జైలు పాలు అవుతున్నారు. తాజాగా, కొంతమంది యువకులు గంజాయి మత్తలో నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశారు. సైకోలను మించిపోయి ప్రవర్తించారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, చెన్నైలోని తిరవళ్లూరుకు చెందిన కొంతమంది యువకులు గంజాయి సేవించారు. గంజాయి మత్తులోనే బైకు నడుపుకుంటూ రోడ్లపైకి వచ్చారు. ఓ చోట వీరి బైకు అదుపు తప్పి కిందపడింది. దీంతో బైకుపై ఉన్న వారు కూడా కిందపడిపోయారు. కిందపడ్డ తర్వాత యువకులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న వారిపైకి గొడవకు దిగారు. వీరి గొడవ కారణంగా రోడ్డు మొత్తం బ్లాక్‌ అయిపోయింది. వాహనదారులు ఎంత మొత్తుకుంటున్నా ఆ యువకులు వినలేదు.

రోడ్డుపై దొర్లుతూ నానా భీభత్సం చేశారు. ఓ యువకుడు వాహనదారులను బూతులు సైతం తిట్టాడు. కొన్ని నిమిషాల పాటు ఆ రోడ్డుపై నానా రచ్చ చేశారు. దీన్నంతా ఓ వాహనదారుడు వీడియో తీశాడు. దాదాపు మూడు నిమిషాలు ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయిపోయాయి’’.. ‘‘ పోలీసులు వీరిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే వారు మరింత రెచ్చిపోతారు’’ అంటూ కామెం‍ట్లు చేస్తున్నారు. మరి, గంజాయి మత్తలు ఆ యువకులు నడి రోడ్డుపై సైకోల్లా ప్రవర్తించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.