iDreamPost
android-app
ios-app

Bangalore: మ్యారేజ్‌ డే గిఫ్ట్‌ ఇవ్వలేదని భార్య పైశాచికత్వం! రాత్రి పూట భర్తపై..

  • Published Mar 05, 2024 | 5:07 PM Updated Updated Mar 07, 2024 | 11:43 AM

Bangalore Crime News: పెళ్లి రోజును కొంతమంది గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ జీవిత భాగస్వామికి బహుమతులు కూడా ఇస్తుంటారు. అలా తనకు మ్యారేజ్‌ డే రోజు గిఫ్ట్‌ ఇవ్వలేదని ఓ భార్య ఊహించని పనిచేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Bangalore Crime News: పెళ్లి రోజును కొంతమంది గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ జీవిత భాగస్వామికి బహుమతులు కూడా ఇస్తుంటారు. అలా తనకు మ్యారేజ్‌ డే రోజు గిఫ్ట్‌ ఇవ్వలేదని ఓ భార్య ఊహించని పనిచేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 5:07 PMUpdated Mar 07, 2024 | 11:43 AM
Bangalore: మ్యారేజ్‌ డే గిఫ్ట్‌ ఇవ్వలేదని భార్య పైశాచికత్వం! రాత్రి పూట భర్తపై..

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. అలాంటి ఓ సంఘటనే ఇది. పెళ్లి రోజు సందర్భంగా భర్త తనకు బహుమతి కొనివ్వలేదని ఏకంగా కత్తితో దాడిచేసింది ఓ భార్య. వినేందుకు వింతగా ఉన్నా.. ఇది నిజం. బెంగళూరులోని బెల్లందూర్‌కు చెందిన ఓ మహిళ పైశాచికంగా ప్రవర్తించి.. తన భర్తను ఆస్పత్రి పాలుజేసింది. మ్యారేజ్‌ డే సందర్భంగా తనకు గిఫ్ట్‌ ఇవ్వలేదనే కోపంతో ఆమె ఈ దాడికి పాల్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భర్త(37 ఏళ్లు) మంచి నిద్రలో ఉన్నాడు.. టైమ్‌ అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది. పక్కనే పడుకుని ఉన్న భార్య(35 ఏళ్లు) మెల్లగా బెడ్రూం నుంచి వంటగదిలోకి వెళ్లింది. అక్కడి నుంచి కూరగాయాలు కోసే ఒక పదునైన కత్తి పట్టుకొచ్చింది. ఆ కత్తితో గాఢనిద్రలో ఉన్న భర్తపై ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని ఘటనతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన భర్త.. తన ఎదురుగా కత్తి పట్టుకుని ఉన్న భార్యను చూసి వణికిపోయాడు. వెంటనే ఆమెను పక్కకు తోసేసి.. అరుపులు పెట్టాడు. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారొచ్చి చూస్తే ఏముంది.. ఆ వ్యక్తి ఒంటిపై రక్తం. భార్య చేతిలో కత్తి. వివరాలు తర్వాత కనుక్కొవచ్చులే అనుకుని.. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

చికిత్స చేసిన తర్వాత కత్తితో జరిగిన దాడి కావడంతో వైద్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది. గాయపడిన వ్యక్తితో పాటు కత్తితో దాడికి పాల్పడిన అతని భార్యను కూడా పోలీసులు విచారించారు. ప్రతి మ్యారేజ్‌ డేకు ఏదో ఒక గిఫ్ట్‌ ఇచ్చే తన భర్త.. ఈసారి గిఫ్ట్‌ ఇవ్వకపోవడంతో కోపం వచ్చి అతనిపై దాడి చేసినట్లు ఆమె ఒప్పుకుంది. తమ మ్యారేజ్‌ కంటే ముందు రోజే మా తాత చనిపోయాడని, ఆ బాధలో ఉన్న తాను మ్యారేజ్ డేను సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకోలేదని, అందుకే గిఫ్ట్‌ కొనలేదని ఆ భర్త చెప్పుకొచ్చాడు. పాపం ఆ భర్త పరిస్థితి చూసి పోలీసులు కూడా జాలిపడ్డారు. వెంటనే అతని భార్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. ఈ ఘటనపై నెటిజన్లు దారుణంగా రియాక్ట్‌ అవుతున్నారు. మరి మ్యారేజ్‌ డేకి గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తపై కత్తితో దాడి చేసిన భార్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.