nagidream
74 Lakh Worth Undalu: వ్యాపారి ఇంట్లో డబ్బాల నిండా తెల్లని ఉండలు కనిపించాయి. చిన్న సైజు పక్షి గుడ్లలా ఉన్నాయి. ఇంట్లో చాలా డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాల నిండా ఈ ఉండలే కనిపించాయి. పోలీసులు కూడా షాక్ అయ్యారు ఆ ఉండలను చూసి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ ఉండల విలువ 74 లక్షలని. 74 లక్షల రూపాయలా? అసలు ఆ ఉండల్లో ఏముంది?
74 Lakh Worth Undalu: వ్యాపారి ఇంట్లో డబ్బాల నిండా తెల్లని ఉండలు కనిపించాయి. చిన్న సైజు పక్షి గుడ్లలా ఉన్నాయి. ఇంట్లో చాలా డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాల నిండా ఈ ఉండలే కనిపించాయి. పోలీసులు కూడా షాక్ అయ్యారు ఆ ఉండలను చూసి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ ఉండల విలువ 74 లక్షలని. 74 లక్షల రూపాయలా? అసలు ఆ ఉండల్లో ఏముంది?
nagidream
డబ్బు సంపాదించడం కోసం డ్రగ్స్ వ్యాపారులు అనేక అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసులు గట్టి నిఘా ఉంచినా కూడా యథేచ్ఛగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. పోలీసులు కూడా సమాచారం అందితే రంగంలోకి దిగి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది పట్టుబడ్డా గానీ కొత్తగా పుట్టుకొస్తున్నారే తప్ప దీనికి అంతం లేకుండా పోయింది. డ్రగ్స్ ని విక్రయించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. డైరెక్ట్ గా డ్రగ్స్ కనబడితే పోలీసులకు దొరికిపోతారేమో అని చెప్పి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషించేది ఏదో మంచిగా జీవించడానికి అన్వేషించినా లైఫ్ బాగుండేదేమో. కానీ చేసిన పాపానికి కర్మ వదిలిపెట్టదు. తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే.
తాజాగా ఓ వ్యక్తి తాను చేసిన పనికి జైలుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఇతను చాలా తెలివిగా డ్రగ్స్ ని బెల్లం పాకంలో మరిగించి ఉండలుగా చేసి ఒక్కో ఉండని ఒక్కో వ్యక్తికి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. హెరాయిన్ డ్రగ్ ని బెల్లం పాకంలో వేసి మరిగించి.. ఆపై ఉండలు చేసి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి 618 గ్రాముల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కి చెందిన అంబాలాల్ సుతార్ (54) అనే వ్యాపారి మూడేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ లోని ఊట్ పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. తానో వ్యాపారవేత్త అని అందరికీ చెప్పుకుంటూ తిరిగేవాడు. అయితే పైకి చెప్పేది ఒకటి.. చీకటిలో చేసే వ్యాపారం ఒకటి. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు.
అయితే అంబాలాల్ డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు అతను ఉండే ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో డబ్బాల్లో ఎక్కువగా ఉండలు కనిపించాయి. అవేమిటో పోలీసులకు తెలియలేదు. దీంతో అనుమానం వచ్చి ఆ ఉండలను టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపించారు. ఆ టెస్టులో ఆ ఉండల్లో హెరాయిన్ ఉందని తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇంట్లో హెరాయిన్ కనబడితే దొరికిపోతానని.. ఇలా బెల్లం పాకంలో వేసి రోజుకొకటి చొప్పున అమ్ముతున్నట్లు వెల్లడించాడు. ఈ హెరాయిన్ బరువు 618 గ్రాములు ఉండగా.. దాని విలువ రూ. 74 లక్షలు ఉంటుందని శంషాబాద్ రూరల్ సీఐ నరేందర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.