iDreamPost
android-app
ios-app

మణిపూర్ తరహాలో మరో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చి..!

  • Published Jul 22, 2023 | 6:21 PM Updated Updated Jul 22, 2023 | 6:21 PM
  • Published Jul 22, 2023 | 6:21 PMUpdated Jul 22, 2023 | 6:21 PM
మణిపూర్ తరహాలో మరో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చి..!

గత కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో అల్లర్లు, దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటికి మొన్న మణిపూర్ లో ఇద్దరు మహిళలను అత్యాచారం, ఆపై వివస్త్రలుగా చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే సామజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తిరిగబడ్డారు. దీంతో పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే బెంగాల్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లా మానిక్ చక్ పరిధిలో ఉన్న ఓ మార్కెట్ కు శనివారం ఇద్దరు మహిళలు వెళ్లారు. అయితే, వీళ్లు మార్కెట్ లో కొన్ని వస్తువులు దొంగతనం చేశారని కొందరు యువకులు వారితో వాదించారు. దీంతో పాటు వారిపై దాడి కూడా చేశారు. ఇంతటితో ఆగకుండా వారిని వివస్త్రలను చేసి ఊరేగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళలను రక్షించి నిందితులను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.

ఈ ఘటనపై స్థానిక బీజేపీ నాయకులు స్పందించి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇదేం పాలన అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మణిపూర్ ఘటన మరువక ముందే బెంగాల్ లో ఇలా జరగడంపై ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వరుస ఘటనలనపై కొందరు మేధావులు స్పందించి మన దేశంలో ఏం జరుగుందంటూ వాపోతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో దారుణం.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom