iDreamPost
android-app
ios-app

రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ నిట్‌ విద్యార్థిని దుర్మరణం!

  • Published Sep 22, 2023 | 2:25 PM Updated Updated Sep 22, 2023 | 2:25 PM
రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ నిట్‌ విద్యార్థిని దుర్మరణం!

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడిపించడం అనుకోని ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. చదువుల్లో నెంబర్ వన్ గా ఉంటూ ఉన్నత విద్యా సంస్థ నీట్ లో సీటు సంపాదించుకున్న విద్యార్థిని ని మృత్యువు వెంటాడింది. డివైడర్ఢీ కొని నీట్ విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాద ఘటన ములుగు జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా నిట్ విద్యార్థుల విహారయాత్ర తీవ్ర విషాదం అయ్యింది. ప్రకృతి అందాలు తిలకించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ నిట్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ము లుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద డివైడర్ ని ఢీ కొని ఆగి ఉన్న లారీ కిందికి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో నిస్సి సిజు (19) అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నిట్ లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏలూరు జిల్లా లింగపాలెం కి చెందిన తాడేపల్లి సిస్సీ, తన స్నేహితులు శ్రెయ, ముర్తుజా, ఉమర్, సాయి, సుజిత్ ఆరుగురు బుధవారం లక్కవరం బయలుదేరారు.

లక్కవరం ప్రకృతి అందాలు తిలకించిన ఆరుగురు విద్యార్థులు అర్థరాత్రి దాటిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే ములుగు మండలం జంగాలపల్లి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిస్సీ అక్కడిక్కడే చనిపోయింది. మిగిలిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆపస్మారక స్థితిలోకి చేరిపోయారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనాల్లో ములుగు జిల్లా హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.