దంపతుల ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

విశాఖ కొమ్మాదిలో ఉన్న శివశక్తికాలనీలో ఎంవీకే ప్రసాద్‌ (54), రాజరాజేశ్వరి (50) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొంత కాలంగా స్మార్ట్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఉన్న ఓ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్నారు. కాగా, ఈ దంపతులు ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికంగా ఉన్న ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ చూపారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.20 నుంచి 25 వేల వరకు వసూలు చేశారు.

అలా కొన్నిరోజులు గడిచింది. డబ్బులు చెల్లించిన ఆ నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో వాళ్లంతా ఎంవీకే ప్రసాద్‌, రాజరాజేశ్వరి దంపతులను ఆశ్రయించారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక ఈ రోజు, రేపు అంటూ రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ, వారికి ఉద్యోగాలు మాత్రం కల్పించలేదు. దీంతో విసుగు చెందిన డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు.. ఈ దంపతులను గట్టిగా ప్రశ్నించారు. ఇక వీరి ఒత్తిడికి ఆ దంపతులకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు.

ఇక చేసేదేం లేక ఈ దంపతులు తాజాగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దంపతుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్న ఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దారుణం: అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దండగులు!

Show comments