iDreamPost
android-app
ios-app

విశాఖలో హనీట్రాప్‌ కలకలం.. పాక్‌ మహిళ వలలో CISF కానిస్టేబుల్‌

  • Published Aug 07, 2023 | 12:36 PM Updated Updated Aug 07, 2023 | 12:36 PM
  • Published Aug 07, 2023 | 12:36 PMUpdated Aug 07, 2023 | 12:36 PM
విశాఖలో హనీట్రాప్‌ కలకలం.. పాక్‌ మహిళ వలలో CISF కానిస్టేబుల్‌

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో హనీట్రాప్‌ కలకలంరేపింది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తోన్న ఒక సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఒకరు పానిస్తాన్‌ మహిళ వలలో చిక్కుకుని.. ఆమెకు కీలక సమాచారం లీక్‌ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ.. పాకిస్తాన్‌కు చెందిన తమీషా అనే మహిళ పన్నిన వలలో చిక్కుకున్నాడు. వీరిద్దరికి సోషల్‌ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ కపిల్‌ కుమార్‌ కదలికలపై అనుమానం రావడంతో.. భద్రతాధికారులు నిఘా పెట్టారు. ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పాకిస్తాన్ మహిళకు అత్యంత కీలక సమాచారం చేరయగా.. అది కాస్త పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.

కేంద్రసమాచారంతో విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్ అలర్ట్ అయ్యి కానిస్టేబుల్‌ కపిల్‌ని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాటిని సీఐఎస్ఎఫ్.. ఫోరెన్సిక్ విచారణకు పంపించింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీస్‌స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఫిర్యాదు చేశారు. కపిల్‌పై అధికారిక రహస్యాలు ఉల్లంఘన నేరం క్రైమ్ నెంబర్ 61/2003 సెక్షన్ 4,9 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.

కపిల్ కుమార్ 2002 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. అంతకు ముందు అతడే రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో విధులు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితమే స్టీల్‌ ప్లాంట్‌ సెక్యూరిటీ విధుల్లో చేరాడు. విశాఖలో గూఢచర్యం కేసులు వెలుగు చూడటం ఇదే మొదటి సారు కాదు. గతంలో షేక్ అబ్దుల్ రెహమాన్ జబ్బార్‌ పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు తేలడంతో.. జబ్బార్‌, అతడి భార్యను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.