iDreamPost
android-app
ios-app

యువకుడి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన ప్రియురాలి తల్లి!

యువకుడి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన ప్రియురాలి తల్లి!

మనిషికి ఎక్స్‌పైర్‌ డేట్‌ ఉన్నట్లే.. మనసులో పుట్టే ప్రేమకు కూడా ఎక్స్‌పైర్‌ డేట్‌ ఉంటుంది. ప్రేమలో సంతోషం ఎంత ఉంటుందో.. అంతకు మించి దుఃఖం కూడా ఉంటుంది. ఆ దుఃఖాన్ని తట్టుకోగలిగిన వాళ్లు కలకాలం ప్రేమతోటే ముందుకు సాగుతారు. అయితే, ఆ దుఃఖానికి తరచూ కారణం మనం ప్రేమించే వారే అయినపుడు.. ప్రేమ స్థానంలో భయం, దూరంగా ఉంటే బాగుంటుందన్న కోరిక మొదలవుతాయి. బ్రేకప్‌లకు ప్రధాన కారణం ఇదే. తాజాగా,  ఓ యువతి తన ప్రియుడితో ఉండలేక బ్రేకప్‌ చెప్పింది.

కలిసి ఉన్నపుడు దిగిన ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేయమని, ఎవరి మానాన వాళ్లు బతుకుదామని అంది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోలేదు. దీంతో యువతి తల్లి రంగంలోకి దిగి.. యువకుడిపై కత్తి దాడి చేసింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన నాగరాజు అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల యువతి నాగరాజుతో ప్రేమకు బ్రేకప్‌ చెప్పింది.

గతంలో పంపిన మెసేజ్‌లు, దిగిన ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేయాలని యువకుడికి చెప్పింది. ఇందుకు యువకుడు ఒప్పుకోలేదు. దీంతో యువతి తల్లి ఆగ్రహానికి గురైంది. ఏకంగా యువకుడి ఇంటికి వెళ్లింది. అతడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, కూతురి ప్రియుడిపై మహిళ దాడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.