iDreamPost

వీడియో: ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే మహిళపై వార్డ్ బాయ్ దారుణం!

వీడియో: ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే మహిళపై వార్డ్ బాయ్ దారుణం!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ గా పని చేస్తున్న ఓ యువకుడు మద్యం మత్తులో ఉండి వైద్యుల కళ్లముందే ఓ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పక్కనున్న కొందరు వైద్యులు అతడిని అడ్డుకోవాల్సింది పోయి సినిమా చూసినట్లుగా చూశారు. ఇంతే కాకుండా కబుర్లు చెప్పుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వకున్నారు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్ లోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఓ యువకుడు వార్డ్ బాయ్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల అతడు అతిగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఇంతే కాకుండా ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే ఓ మహిళతో గొడవకు దిగాడు. ఆమెతో వాగ్వాదానికి దిగడమే కాకుండా కోపంతో ఆ మహిళపై దాడికి దిగాడు. ఇదంతా చూస్తున్నఅక్కడున్న కొందరు వైద్యులు సినిమా చూసినట్లు చూశారు. ఇంతే కాకుండా ఏ ఒక్కరు కూడా ఆ యువకుడిని అడ్డుకోకపోగా.. ముసి ముసినవ్వులు నవ్వుకున్నారు.

అనంతరం బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి