iDreamPost
android-app
ios-app

అమ్మాయిపై కన్నేసిన నలుగురు యువకులు! బలవంతంగా మద్యం తాగించి..!

దిశ, నిర్భయ వంటి ఘటనలు మరువక ముందే ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

దిశ, నిర్భయ వంటి ఘటనలు మరువక ముందే ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

అమ్మాయిపై కన్నేసిన నలుగురు యువకులు! బలవంతంగా మద్యం తాగించి..!

దేశంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి అత్యాచార దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘోరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు రూపొందించాయి. అయినా దుర్మార్గుల దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడలేకపోతోంది. ఇదిలా ఉంటే.. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొక వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. నలుగురు యవకులు ఓ యువతిపై కన్నేసి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఓ హోటల్ రూమ్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు మద్యం తాగించి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని ఓ హోటల్ లో ఓ యువతి గత ఏడాది నుంచి పని చేస్తుంది. అయితే, ఆమెకు ఓ స్నేహితురాలు ఉంది. ఆమె ఫ్రెండ్స్ హోటల్ లో పని చేసే యువతిపై కన్నేశారు. ఎలాగైన ఆ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆ నలుగురు యువకులు ఆ యువతి పని చేసే హోటల్ కు వెళ్లారు. అక్కడికి చేరుకుని ఆమెపై దాడి చేశారు. ఇంతే కాకుండా ఆ యువతిని బలవంతంగా పక్కనే ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ఆమె కొద్దిగా మత్తులోకి వెళ్లింది.

ఆ తర్వాత ఈ కిరాతకులు ఆ అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అన్నీ చేసి ఆ దుర్మార్గులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదంతా గమనించిన హోటల్ లో పని చేసే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు హోటల్ కు చేరుకుని అక్కడ పని చేసే సిబ్బందితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఆ హోటల్ లో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు.

అందులో ఆ దుండగులు యువతిపై దాడి చేసి ఆమెను బలవంతంగా రూమ్ లోకి లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలో ఉన్న యువతి వద్దకు వెళ్లి ఆమెను అలా చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మహిళతో పాటు మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş