Uttar Pradesh Crime News: గుట్కాకు బానిసైన ఇంటర్ విద్యార్థిని.. అసలు విషయం తెలియడంతో..!

గుట్కాకు బానిసైన ఇంటర్ విద్యార్థిని.. అసలు విషయం తెలియడంతో..!

ఈ కాలం యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువతి గుట్కాకు బానిసైంది. అసలు విషయం బయటపడడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

ఈ కాలం యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువతి గుట్కాకు బానిసైంది. అసలు విషయం బయటపడడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

ఈ రోజుల్లో చదువుకునే విద్యార్థులు మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఇంకొందరు యువకులు అయితే బహిరంగంగానే మద్యం సేవిస్తూ నానా రచ్చ చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇక తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్న వారి మాట లెక్క చేయకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్ విద్యార్థిని గుట్కాకు అలవాటు పడింది. ఇదే విషయం టీచర్ కు తెలియడంతో ఆ బాలిక షాక్ గురై ఆ తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ మహోబాలోని కబ్రాయ్ ప్రాంతంలోని బద్రీ సింగ్ కన్యా కాలేజీలో అంజలి సాహూ (17) అనే బాలిక ఇంటర్ చదువుతోంది. అయితే, ఈ బాలిక గత కొన్ని రోజుల నుంచి గుట్కాకు అలవాటు పడింది. తాజాగా ఈ విద్యార్థిని కాలేజీలో గుట్కా తింటుండగా టీచర్ గమనించింది. చదువుకునే వయసులో ఇవేం పాడు పనులు అంటూ హెచ్చరించారు. ఇక ఇదే విషయాన్ని బాలిక తండ్రికి ఫోన్ చేసి వివరించి వెంటనే కాలేజీకి రప్పించారు. అనంతరం క్లాస్ లో అందరి ముందే టీచర్ అంజలి బ్యాగ్ చెక్ చేయగా.. అందులో నుంచి గుట్కా ప్యాకెట్లు బయట పడ్డాయి. ఇవి చూసి ఆ బాలిక తండ్రి షాక్ గురయ్యాడు. మీ కూతురు ఈ అలవాటు మానుకునేంత వరకు కాలేజీకి రానిచ్చేది లేదని తెగేసి చెప్పింది. అందరి ముందు పరువు పోవడంతో అంజలి అవమానంగా భావించింది.

ఆ తర్వాత ఆ బాలిక తండ్రితో పాటు ఇంటికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూనే ఆ బాలిక ఇంట్లోకి వెళ్లి గది తలుపుల పెట్టుకుంది. ఆలస్యంగా గమనించిన అంజలి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. కూతురు సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆ అమ్మాయి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. గుట్కాకు బానిసైందని టీచర్ అవమానించడంతో ఆత్మహత్య చేసుకున్న ఈ బాలిక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments