iDreamPost
android-app
ios-app

ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలిన బాలుడు! అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో కనిపించకుండాపోయిన బాలుడు చివరికి ఓ ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో కనిపించకుండాపోయిన బాలుడు చివరికి ఓ ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలిన బాలుడు! అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన బాలుడు చివరికి ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయం తెలుసుకుని ఆ బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ ఇంట్లో ఉన్న ఆ బాలుడిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త మనీష్ కనోడియా కుమారుడు కుశాగ్రా (16) స్థానికంగా ఉండే రచిత అనే యువతి వద్ద రోజూ ట్యూషన్ కు వెళ్లేవాడు. అయితే ఉన్నట్టుండి కుశాగ్రా కనిపించ కుండపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలోనే కుశాగ్రా కిడ్నాప్ కు గురయ్యాడని తెలిసింది. ఇందులో భాగంగానే పోలీసులు ఆ ట్యూషన్ టీచర్ రచిత ఇంట్లో వెతకగా అతడు శవమై కనిపించాడు. ఆ తర్వాత పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఈ పోలీసులు ట్యూషన్ టీచర్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అందులో ట్యూషన్ టీచర్ రచిత, ఆమె ప్రియుడితో పాటు ఆ బాలుడు ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే కుశాగ్రాని ట్యూషన్ టీచర్ రచిత, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుమారుడుమృతితో అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/