iDreamPost
android-app
ios-app

మైనర్ కూతురిని చంపి బావిలో పడేసిన తల్లి! ఎందుకో తెలుసా?

ఓ తల్లి తన మైనర్ కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఊళ్లో బావిలో పడేసి చేతులు దులుపుకుంది. ఇక తనకేం సంబంధం లేదన్నట్లుగా కట్టింగ్ లు ఇచ్చి చివరికి పోలీసులకు దొరికిపోయింది.

ఓ తల్లి తన మైనర్ కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఊళ్లో బావిలో పడేసి చేతులు దులుపుకుంది. ఇక తనకేం సంబంధం లేదన్నట్లుగా కట్టింగ్ లు ఇచ్చి చివరికి పోలీసులకు దొరికిపోయింది.

మైనర్ కూతురిని చంపి బావిలో పడేసిన తల్లి! ఎందుకో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన మైనర్ కూతురిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఊళ్లో బావిలో పడేసి చేతులు దులుపుకుంది. ఇక తనకేం సంబంధం లేదన్నట్లుగా కట్టింగ్ లు ఇచ్చి చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ తల్లి కన్న కూతురిని ఎందుకు చంపింది? అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కౌషాంబి జిల్లా మాజాన్ పూర్ పరిధిలోని తేజ్వాపూర్ గ్రామం. ఇక్కడే శివపత్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెల సంతానం. పెద్ద కూతురు (15) ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారాన్నినడిపినట్లుగా తెలుస్తుంది. కూతురు ప్రవర్తనను గమనించిన తల్లి.. రెండు మూడు సార్లు మందలించింది. అయినా కూతురు మాట వినడం లేదని తల్లి శివపత్ కోపంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే పెద్ద కూతురుని చంపాలని తల్లి పథకం రచించింది.

ఇందులో భాగంగానే మరో కూతురి సాయంతో ఈ నెల 2న పెద్ద కూతురిని హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమనం రాకుండా ఆ మృతదేహాన్ని దగ్గరలోని ఓ బావిలో పడేసి చేతులు దులుపుకుంది. అనంతరం నా కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఈ నెల 22న ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని ముందుగా తల్లిని విచారించారు.

దీంతో తల్లి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఇక గట్టిగా విచారించే సరికి.. నా కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని, ఇది నచ్చకే నా రెండవ కూతురితో కలిసి హత్య చేశానని నేరాన్ని అంగీకరించింది. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక హత్య చేసిన తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet