iDreamPost
android-app
ios-app

నెల కిందట పెళ్లి, నవ వధువును కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు! ఎందుకంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. నూతన వధువుని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. నూతన వధువుని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

నెల కిందట పెళ్లి, నవ వధువును కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు! ఎందుకంటే?

పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ దంపతులు. వీరు గత నెల కిందట ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసకుంది. ఈ నూతన వధువుని ఆమె సొంత తల్లిదండ్రులు ఇటీవల కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వరుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకు ఆ నూతన వధువుని ఆమె తల్లిదండ్రులు ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బరేలోని భదోహి ప్రాంతానికి చెందిన విశాల్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఖుష్భూ బానో అనే యువతిని ప్రేమించాడు. ఈ అమ్మాయి కూడా అతడిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ గత కొన్నాళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక ఇద్దరి మతాలు వేరు కావడంతో ఆగస్టు నెలలో ఈ యువతి తన మతాన్ని మార్చుకుంది. ఇక తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఖుష్భూ నెల రోజుల కిందట ప్రియుడు విశాల్ ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ నూతన దంపతులు ఆ యువకుడి ఇంట్లోనే ఉంటున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన నెల రోజులకే విశాల్ ఇంట్లో లేని సమయంలో నూతన వధువు అయిన ఖుష్బూని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న విశాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భార్యను ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని, ఆమెను రక్షించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంతే కాకుండా ఆమె తల్లిదండ్రుల నుంచి ఖుష్బూకు ప్రాణహాని కూడా ఉందని అతడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువతిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేస్తుండగా ఆ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను పోలీసులు సైతం పరిశీలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, ఉన్నట్టుండి భార్యను కిడ్నాప్ చేయడంతో విశాల్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లైన నెల రోజులకే నూతన వధువుని ఆమె సొంత తల్లిదండ్రులు కిడ్నాప్ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet