Uttar Pradesh Crime News: అత్యాచారం చేయబోయిన యువకుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ!

అత్యాచారం చేయబోయిన యువకుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారం చేయబోయిన యువకుడికి ఆ మహిళ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ దెబ్బతో ఆ యువకుడు కోలుకోలేకపోతున్నాడు. ఇంతకు ఈ మహిళ ఏం చేేసిదో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారం చేయబోయిన యువకుడికి ఆ మహిళ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ దెబ్బతో ఆ యువకుడు కోలుకోలేకపోతున్నాడు. ఇంతకు ఈ మహిళ ఏం చేేసిదో తెలుసా?

రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. కొందరు యువకులు కామంతో రెచ్చిపోతున్నారు. ఐలవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోటు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వరుస నేరాలపై ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ యువకుడు పట్టపగలు ఓ మహిళ ఇంట్లోకి దూరాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా అత్యాచారం చేయబోయాడు. వెంటనే అలెర్ట్ అయిన ఈ మహిళ యువకుడికి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈమె చేసిన పనికి చివరికి పోలీసులే షాక్ గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లా మంజన్ పుర్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉండేవారు. అయితే ఈ మహిళ భర్త గతంలో ఉపాధి నిమిత్తం సౌది అరేబియాలో ఉంటున్నాడు. అయితే, అప్పటి నుంచి ఈ మహిళ ఇంట్లో ఓ యువకుడు పని చేస్తూ వచ్చాడు. చాలా కాలంగా నమ్మకంగా ఉంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ యువకుడు మాత్రం ఆ మహిళపై కన్నేశాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆ రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. అయితే ఇందులో భాగంగానే ఆ యువకుడు బుధవారం ఎవరూ లేని టైమ్ చూసుకున్నాడు. ఇక వెంటనే ఆ మహిళ ఇంట్లోకి దూరిపోయాడు.

తర్వాత ఆ యువకుడు బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆ మహిళ ఆ యువకుడు చేస్తున్న పనికి షాక్ గురైంది. అప్రమత్తమై ఇంట్లో ఉన్న కత్తితో ఆ దుండగుడి ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసింది. ఆ యువకడు మాత్రం రక్తపు మడుగులో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇక  ఇంతటితో సరిపెట్టని ఈ మహిళ.. కట్ చేసిన ఆ ప్రైవేట్ పార్ట్స్ ను ఓ కవర్ తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయింది. అనంతరం ఆ మహిళ జరిగిందంతా పోలీసులకు వివరించింది. ఇక ఆ మహిళ చెప్పిన వివరాలు తెలసుకుని పోలీసులు షాక్ గురయ్యారు. వెంటనే ఆమెను  అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డ యవకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆ మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అత్యాచారం చేయబోయిన యువకుడి ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments