iDreamPost
android-app
ios-app

ఆ గ్రామంలో ముగ్గురి హత్య, పలు ఇళ్లకు నిప్పు! అసలేం జరిగిందంటే?

ఆ గ్రామంలో ముగ్గురి హత్య, పలు ఇళ్లకు నిప్పు! అసలేం జరిగిందంటే?

ఆ గ్రామంలో కొందరు దుండగులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంతటితో సరిపెట్టకుండా అదే ఊరిలోని పలు ఇళ్లకు నిప్పు కూడా పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు గ్రామంలోకి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? గొడవలకు దారి తీసిన కారణాలు ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లా మొహియుద్దీన్ పూర్ గ్రామం. ఇదే ఊరిలోని కొందరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా భూ వివాదాలు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో చాలా సార్లు ఇరు కుటుంబాలు గొడవ పడ్డారు. ఇక గురువారం సైతం మరోసారి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె, అల్లుడిని మరో కుటుంబానికి చెందిన వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోపంతో ఊగిపోయిన బాధిత కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లకు నిప్పు పెట్టి హల్చల్ చేశారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన గ్రామంలోకి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పివేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గ్రామంలో ముగ్గురి హత్య, పలు ఇళ్లకు నిప్పులు పెట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి పరిస్థితి చక్క దిద్దుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetgrandpashabet