iDreamPost
android-app
ios-app

సొంత చెల్లిని హత్య చేసి తలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు!

సొంత చెల్లిని హత్య చేసి తలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు!

ఈ మధ్యకాలంలో కొందరు పరువు కోసం ఎంతకైన తెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయి మరో వర్గానికి చెందని యువకుడితేనే ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ప్రేమించాడని తెలిస్తే మాత్రం ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. చెల్లెలు మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో ఆమె సోదరుడు సోదరిని హత్య చేసి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ పరిధిలోని మిత్వారా గ్రామంలో ఓ యువతి నివాసం ఉంటుంది. గత కొంత కాలంగా ఈమె మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుంది. అలా వీరి ప్రేమాయణం కొన్ని రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే, ఇదే విషయం ఇటీవల ఆ యువతి సోదరుడైన రియాజ్ (24)కు తెలిసింది. దీంతో అతడు కోపంతో ఊగిపోయాడు. మా పరువు తీస్తున్న చెల్లిని ఎలాగైన హత్య చేయాలని అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే రియాజ్ ఇటీవల సోదరిని దారుణంగా హత్య చేశాడు.

ఆ తర్వాత ఆమె తలను మొండం నుంచి వేరు చేశాడు. ఇక అదే తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. చెల్లి మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో హత్య చేసిన ఆమె సోదరుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ట్రయాంగిల్ లవ్ స్టోరీ! ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి దారుణ హత్య..

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet