iDreamPost

వీడియో: ఇలా తయారయ్యారేంట్రా.. మద్యం తాగలేదని డాబాపై నుంచి తోసేస్తారా?

  • Published May 28, 2024 | 8:22 PMUpdated May 28, 2024 | 8:22 PM

ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోవడానికి మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకు కూడా ఇతరులపై కోపగించుకోవడం, దాడి చేయడం ఇప్పుడు పెరిగిపోయింది.

ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోవడానికి మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకు కూడా ఇతరులపై కోపగించుకోవడం, దాడి చేయడం ఇప్పుడు పెరిగిపోయింది.

  • Published May 28, 2024 | 8:22 PMUpdated May 28, 2024 | 8:22 PM
వీడియో: ఇలా తయారయ్యారేంట్రా.. మద్యం తాగలేదని డాబాపై నుంచి తోసేస్తారా?

ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోవడానికి మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకు కూడా ఇతరులపై కోపగించుకోవడం, దాడి చేయడం ఇప్పుడు పెరిగిపోయింది. ఒక్కోసారి ఆగ్రహంలో తమ మీదే తామే దాడి చేసుకుంటున్నారు. ఇలా కోపంలో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడా ఇక్కడా అనే తేడాల్లేవు.. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాగిన మత్తులో చేసిన గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి వార్తల్లో చూస్తేనే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో అమాయకులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మందు తాగలేదని ఓ వ్యక్తిని డాబా మీద నుంచి తోసేశారు. ఈ వార్త చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. రంజిత్ సింగ్ అనే వ్యక్తి మద్యం అమ్మేవాడు. అతడి దగ్గర చాలా మంది మద్యం కొనేందుకు వచ్చేవారు. మద్యంతో పాటు భోజనం కూడా లభిస్తుండటంతో అక్కడికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన రాత్రిపూట నలుగురు వ్యక్తులు ఆ డాబాకు వచ్చారు. వచ్చిన వాళ్లు తాగి వెళ్లిపోకుండా.. రంజిత్ సింగ్​ను కూడా మందు తాగమన్నారు. అయితే అందుకు అతడు నిరాకరించాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లను హెచ్చరించాడు.

రంజిత్ సింగ్ మందు తాగేందుకు నిరాకరించడంతో ఆ నలుగురు వ్యక్తులు సీరియస్ అయ్యారు. వాళ్లు ఆగ్రహం పట్టలేకపోయారు. తమనే వెళ్లిపొమ్మంటావా అంటూ అతడితో గొడవకు దిగారు. మద్యం మత్తులో రంజిత్ సింగ్​పై దాడి చేసి అతడ్ని కొట్టారు. ఆ తర్వాత డాబా మీద నుంచి కిందకు తోసేశారు. రంజిత్ సింగ్ పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇలాంటి వాళ్లను అస్సలు వదిలిపెట్టొద్దని కోరుతున్నారు. శిక్ష పడుతుందనే భయం ఉంటే ఇలాంటివి చేయరని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మద్యం తాగలేదని వ్యక్తిని కిందకు తోసేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి