iDreamPost
android-app
ios-app

ఘోరం: స్కూలు విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు!

School Students Forced To Clean Septic Tank: విద్యా బుద్ధు నేర్పాల్సిన టీచర్లే దారుణానికి ఒడిగట్టారు. పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో అత్యంత ఘోరమైన పని చేయించారు.

School Students Forced To Clean Septic Tank: విద్యా బుద్ధు నేర్పాల్సిన టీచర్లే దారుణానికి ఒడిగట్టారు. పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో అత్యంత ఘోరమైన పని చేయించారు.

ఘోరం: స్కూలు విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు!

విద్యార్థుల భవితకు బాటలు వేసేవి విద్యాలయాలు. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే  కర్మాగారాలు పాఠశాలలు. అలాంటి ఒక విద్యాలయంలో అమానవీయ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేయించారు. ఈ మొత్తం తతంగం పాఠశాల ప్రిన్సిపాల సమక్షంలోనే జరగడం అందరినీ మరింత షాక్ కు గురిచేస్తోంది. విద్యార్థులకు పనిష్మెంట్ ఇవ్వడంలో భాగంగానే ఇలా చేయించారంటూ చెబుతున్నారు. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘోరం కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగింది. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. పాఠశాలలో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులతో స్కూల్ ప్లిన్సిపాల్ దగ్గరుండి సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేయించారు. వారిలో ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా ట్యాంక్ లోకి దింపమరీ క్లీన్ చేయించారు. ఇదంతా చేసింది విద్యార్థులకు పనిష్మెంట్ లో భాగంగా అని చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత యావత్ రాష్ట్రమే నివ్వెరపోయింది. పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిందిపోయి.. శిక్షల పేరుతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడున్న ఓ టీచర్ రికార్డు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర యంత్రాంగం ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ సహా.. ఇద్దరు టీచర్లు, హాస్టల్ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్, మరో టీచర్ ను అరెస్టు కూడా చేశారు. మరోవైపు ఈ షాకింగ్ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పని చేసింది ఎవరైనా వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రం సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హేచ్ సీ మహదేవప్ప ఈ ఘటనపై స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు, వార్డెన్ ను సస్పెండ్ చేశామన్నారు. అంతేకాకుండా ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు కూడా ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థులపై సెప్టిక్ ట్యాక్ శుభ్రం చేయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.