iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

రామేశ్వరం కేఫ్ ఘటన మర్చిపోక ముందు.. మరో సంఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ పాఠశాలలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఎక్కడంటే..

రామేశ్వరం కేఫ్ ఘటన మర్చిపోక ముందు.. మరో సంఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ పాఠశాలలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఎక్కడంటే..

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

ఒక్క సారిగా దేశం ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన. గత శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ కేఫ్‌లో బాంబు పేలడంతో అలజడి మొదలైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. బ్యాగ్‌తో కేఫ్‌లోకి వెళ్లిన వ్యక్తిని.. ఆ తర్వాత అక్కడే దాన్ని వదిలి పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 10 మంది గాయపడిన సంగతి విదితమే. ఈ కేసును ఇప్పటి వరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేతికి వెళ్లింది. ఈ మేరకు ఈ బ్లాస్ట్ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో అనుమానితుల్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి.. విచారిస్తున్నారు. ఈ పేలుడు ఘటనతో.. పలు ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు.

ఇంకా ఆ సంఘటన మర్చిపోనేలేదు.. ఇప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అదీ కూడా కార్పొరేట్ స్కూళ్లకు రావడం ఆందోళన కలిగింది. కోయంబత్తూర్‌లోని పీఎస్ఎంబీబీ మిలినీయం స్కూల్, కాంచీపురంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. పీఎస్ఎంబీబీ మిలినీయం పాఠశాలకు ఆదివారం రాత్రి.. మెయిల్ ద్వారా ఈ థ్రెట్ రాగా, కాంచీ పురం పాఠశాలకు సోమవారం ఉదయం.. ఇలాంటి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాంబ్ స్వ్కాడ్ తో మిలీనియం స్కూల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు.

కాగా, ఇలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలియగానే.. విద్యార్థులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కాస్త అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ఇక కాంచీపురం పాఠశాలకు వచ్చిన బెదిరింపు కాల్.. ఫేక్ కాల్ అని నిర్ధారించారు పోలీసులు. అయితే మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో.. ఎక్కడి నుండి మెయిల్ వచ్చిందని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ఇక ఈ రెండు నగరాల్లో అప్రమత్తమయ్యారు. అలాగే ఈ పాఠశాలలకు భద్రను పెంచారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే.. పాఠశాలల్లోకి అనుమతి ఇస్తున్నారు.