iDreamPost
android-app
ios-app

విషాదం: తల్లిని కాపాడబోయి మృతి చెందిన కుమారుడు!

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లిని కాపాడబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లిని కాపాడబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విషాదం: తల్లిని కాపాడబోయి మృతి చెందిన కుమారుడు!

ములుగు జిల్లాకు చెందిన రజితకు సురేష్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంటర్ పూర్తి చేసిన ఈ యువకుడు చాలా రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇక అప్పటి నుంచి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్టంలో భాగమవుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఓ ఊహించని ఘటనతో సురేష్ మృతి చెందాడు. ఆ యువకుడు తన తల్లి రజిత ప్రాణాలను కాపాడబోయి చివరికి అతడే ప్రాణాలతో లేకుండా పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తల్లిని రక్షించబోయి సురేష్ ఎలా మృతి చెందాడు? ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని ములుగు జిల్లా సత్తుపల్లిలో పోరిక బాలు-రజిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సురేష్ (22) అనే కుమారుడు ఉన్నాడు. ఈ యువకుడు ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన అప్పటి నంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో పాటు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వారి కష్టాన్ని పంచుకుంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం రజిత బట్టులు ఉతికింది. ఆ తర్వాత ఇంటి ముందు ఉన్న కరెంట్ స్తంభానికి వీరు గతంలో బట్టలు ఆరేసేందుకు ఓ ఇనుప తీగను ఏర్పరుచుకున్నారు. ఇక రజిత ఉతికిన బట్టలు ఆరేసేందుకు ఇంటి ముందున్న తీగపై బట్టలు వేయబోయింది.

అయితే ఈ క్రమంలోనే రజిత కరెంట్ షాక్ కు గురైంది. వెంటనే అప్రమత్తమైన ఆమె కొడుకు సురేష్.. ఇంట్లో నుంచి పరుగెత్తుకొచ్చి తన తల్లిని కాపాడబోయాడు. ఇదే సమయంలో తల్లి, కుమారుడు ఇద్దరూ కరెంట్ షాక్ కు గురై కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వారి కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సురేష్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

ఇదే ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొన్నటి వరకు ఎంతో హుషారుగా ఉన్న సురేష్ ఇక రాడు, కనిపించడు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కరెంట్ షాక్ కు గురైన తల్లిని కాపాడబోయి మృతి చెందిన సురేష్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి