P Krishna
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు అని పెద్దలు అంటారు. ఈ మద్య కాలంలో మనిషి ఏ క్షణంలో మృత్యువడిలోకి చేరుతున్నారో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంటారు.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు అని పెద్దలు అంటారు. ఈ మద్య కాలంలో మనిషి ఏ క్షణంలో మృత్యువడిలోకి చేరుతున్నారో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంటారు.
P Krishna
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా మనకు దూరం కావడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు ఇలా పలు కారణాల వల్ల తమవారిని కోల్పోయి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతున్నారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో లోతుగా ఉండే ప్రాంతాల్లో ప్రమాద వశాత్తు మునిగిపోయి చనిపోతుంటారు. కొన్నిసార్లు వారిని కాపాడటానికి వెళ్లిన వారు కూడా మృత్యువాత పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒకరిని కాపాడబోయి, మరో ఐదుగురు నీళ్లలో దూకి ప్రాణాలు కోల్పోయిన విషాద గటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. మౌలానా అహ్మద్ సలీమ్ కలీల్ (44) కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. పాతిక మంది శిరసి నుంచి శాల్మలా నది తీరానికి వచ్చారు. ఈ క్రమంలోనే భూతనంగడి వద్ద ఓ బాలుడు అనుకోకుండా ప్రమదా వశాత్తు నదిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మౌలానా నీళ్లలోకి దితాడు. బాలుడిని ఒడ్డుకు చేర్చి తల్లి నాదియాకు అందించాడు. అదే సమయంలో బిడ్డను అందుకోబోయి నాదియానా నీళ్లలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ముగ్గురు నీటిలోకి దూకారు. దీంతో ఐదురురు నీటిలో మునిగిపోయారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు నబీల్ నూర్ అహ్మద్ షేక్, మౌలానా అహ్మద్ సలీమ్ కలీల్, నాదియానా, ఉమర్ సిద్దీక్, మిస్పాతబసుమ్ లుగు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తుననానరు. విషాదయాత్రలకు వెళ్లేవారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని.. చిన్న ఏమరుపాటు వల్ల బాలుడు నదిలో పడటం, అతని కోసం ఐదురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో సంతోషంతో వెళ్లిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.