iDreamPost
android-app
ios-app

వీడియో: డ్యాన్స్ చేస్తూనే హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన యువతి!

  • Published Apr 29, 2024 | 9:00 AM Updated Updated Apr 29, 2024 | 9:01 AM

ఈ మద్య కాలంలో పెళ్లి వేడుకలు ఎంత సంతోషంగా జరుగుతున్నాయి... కొన్నిసార్లు అంతే విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా డీజే సౌండ్స్ విని, డ్యాన్స్ లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఈ మద్య కాలంలో పెళ్లి వేడుకలు ఎంత సంతోషంగా జరుగుతున్నాయి... కొన్నిసార్లు అంతే విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా డీజే సౌండ్స్ విని, డ్యాన్స్ లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

వీడియో: డ్యాన్స్ చేస్తూనే హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన యువతి!

ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద అనే వయసు తేడా లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు పెద్ద వయసు వారికే ఎక్కువగా గుండెపోటు వస్తుందని అనేవారు.. కానీ ఇప్పుడు మారుతున్న జీవన శైలి కారణంగా చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకాంర కోవిడ్ 19 తర్వాత గుండెపోటు మరణాలు మరింతగా పెరిగిపోయాయని ఎన్‌సిఆర్‌బి వెల్లడించింది. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఎక్కువగా డ్యాన్స్, వ్యాయాయం చేయడం, పెద్ద శబ్ధాలతో డీజే సౌండ్స్ వల్ల గుండెపోటు వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇటీవల పలు శుభకార్యాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్యాన్స్ చేస్తుండగా ఓ యువతి కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మీరట్ జిల్లాకు చెందిన ఓ యువతి హార్ట్ ఎటాక్ తో కన్నుమూసింది. తన సోదరి హల్దీ వేడుకలో అందరితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా.. హఠాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయింది. డీజే పాటలకు పిల్లలతో కలిసి డ్యాన్స్ వేస్తూ హ్యాపీగా ఉన్న ఆ యువతి అంతలోనే అందరూ చూస్తుండగా కిందపడిపోయి ఆపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు పరీక్షించి యువతి గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించారు. ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబం సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

యూపీలోని అమ్రోహా జిల్లాలో ఆదివారం మరో విషాద సంఘటన జరిగింది. అమ్రోహాలోని సైదంగలి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల దిల్షాద్ ఖురేషీ 11వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం దిల్షాద్ ఇంట్లో ఉండి మొబైల్‌లో వీడియోలు చూస్తున్నాడు. హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో ఊపిరాడక అక్కడిక్కడే కన్నుమూయడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎంతో చురుకైన తమ కుమారుడు ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. గుండెపోటు కారణంగా ఎక్కువ శాతం యువత చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం యువతి కి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.