iDreamPost
android-app
ios-app

హృదయాలను కలచి వేస్తున్న నలుగురు ఆడపిల్లల రోదన!

మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుంతో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్ళు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు.

మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుంతో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్ళు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు.

హృదయాలను కలచి వేస్తున్న నలుగురు ఆడపిల్లల రోదన!

మృత్యువు ఎప్పుడు ఎలా పొంచి కాటు వేస్తుందో తెలియదు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, గుండెపోటు మరణాలు, కెరెంట్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా మృత్యువు కబలిస్తుంది. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మిగులుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. అలా ఇసుకు గుంతలో చిక్కుకున్న ఎడ్లబండి యజమాని మృతి చెందిన ఘటన గూడలిలోని స్వర్ణముఖి నది వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గూడలి లోని అరుంధతివాడకు చెందిన పొల్లుల మస్తాన్.. వయసు 40 ఏళ్లు. ఎండ్లబండిలో ఇసుక తరలిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ లాగే మస్తాన్ ఇతర ఎడ్ల బండ్లతో కలిసి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి ఇసుక నింపుకొని వెళ్తున్నాడు. అయితే కొంతమంది జేసీబీ తో ఎడ్ల బండ్లు వెళ్లకుండా రోడ్డు మార్గంలో పెద్ద గాడి తీసినట్లు కొంతమంది గుర్తించడంతో ఒక్కొక్కరుగా తమ బండ్లను గాడిని తప్పిస్తూ మెల్లిగా దాటుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే మస్తాన్ ఎడ్లబండి గాడిలో ఒరిగిపోయింది.. దీంతో ఎడ్లు పట్టు తప్పడంతో ఇసుక గుంతలో పడి మస్తాన్ ఊపిరి ఆడక చనిపోయాడు. ఇది గమనించి తోటి బండ్ల వారు.. వెంటనే అతన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే మస్తాన్ చనిపోవడం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న అరుంధత కాలనీ వాసులు అక్కడికి వెళ్లి దీనికి కారణం అయిన గూడలికి చెందిన కేశవరెడ్డితో వాగ్వాదానికి దిగారు.

మస్తాన్ మృతదేహాన్ని అతని ఇంటి ముందు ఉంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.. మస్తాన్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎస్ ఐ అక్కడి చేరుకొని గొడవ సర్ధుమణిగేలా చేసి మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించారు. పెద్ద దిక్కు అయిన మస్తాన్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మస్తాన్ కి భార్య బుజ్జమ్మ, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుంది. మిగతా ఆడపిల్లలు స్కూల్ చదువులు. అనుకోని ప్రమాదంలో మస్తాన్ ని మృత్యువు కబలించడంతో మృతదేహంపై పడి మాకు ఇంకా దిక్కు ఎవరు అంటూ భార్యా, నలుగురు ఆడపిల్లలు కన్నీరు పెట్టుకోవడంతో గ్రామస్థులు సైతం చలించిపోయారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి