P Krishna
Tamil Nadu Crime News: పెళ్లంటే నూరేళ్ల పంట.. భర్తతో ఏడడుగులు నడిచి ఎంతో అందమైన జీవితాన్ని ఊహించిన ఆమె జీవితంలో అగాధం ఏర్పడింది.
Tamil Nadu Crime News: పెళ్లంటే నూరేళ్ల పంట.. భర్తతో ఏడడుగులు నడిచి ఎంతో అందమైన జీవితాన్ని ఊహించిన ఆమె జీవితంలో అగాధం ఏర్పడింది.
P Krishna
వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండూ నూరేళ్లు చల్లగా కలిసిమెలిసి జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య దంపతులు చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధల కారణంగా గొడవలు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కొంతమంది మహిళలు పురుషుల అహంకారం, అనుమానాలకు తీవ్ర మనస్థాపానికి గురై తనువు చాలించుకుంటున్నారు. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం చూస్తుంటాం. ఇటీవల అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. పిల్లలు పుట్టలేదన్న సాకుతో అత్తింటి వారి వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పపడిన మహిళలలు ఎంతోమంది ఉన్నారు. ఓ మహిళ అనుమానాస్పద స్తితిలో కన్నుమూయడం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. యువతి అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. అత్తింటి వారే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని.. భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని యువతి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. తిరువళ్లూరు జిల్లా తిరువొత్తియూర్ కి చెందిన పుష్పనాథన్ కూతురు షాలిని (24) వేపంబట్టుకు చెదిన మురళీధరన్ తో 9 నెలల క్రితం పెళ్లైంది. అంబత్తూరు లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మురళీధరన్ జాబ్ చేస్తున్నాడు. ఈ జంట పెళ్లైన రెండు మూడు నెలలు సంతోషంగా ఉన్నా తర్వాత భర్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం మొదలయ్యాయి. తొమ్మిది నెలలు అవుతున్నా పిల్లల గురించి తీపి కబురు చెప్పకపోవడంతో అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే భార్యాభర్తలు హాస్పిటల్ కి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకున్నారు. రక్త పరీక్షలో నెగిటీవ్ రావడంతో మనస్థాపానికి గురైన షాలిని కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటూ వస్తుందని భర్త చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి షాలిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. పుట్టింటికి వారికి సమాచారం ఇవ్వకుండా అత్తింటివారు హాస్పిటల్ కి తరలించారు. తమ కూతురిని అత్తింటి వారే వేధించి ఉరివేసి చంపారని.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని షాలిని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించారు. షాలిని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.