iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. YSRCP ఎమ్మెల్యే బంధువులు మృతి!

  • Published Dec 27, 2023 | 12:24 PM Updated Updated Dec 27, 2023 | 12:40 PM

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం నింపింది. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం నింపింది. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..

  • Published Dec 27, 2023 | 12:24 PMUpdated Dec 27, 2023 | 12:40 PM
బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. YSRCP ఎమ్మెల్యే బంధువులు మృతి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం,నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎంతో  మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తుంటారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందారు. తాజాగా అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని జాన్స్ కౌంటీలో వైసీపీ ఎమ్మెల్యే బంధువులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరావు కుటుంబం ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంలోని ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగా, మనవడు, మనవరాలు మృతి చెందారు. అల్లుడు లోకేశ్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబం అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగేశ్వరరావు, సీతామహలక్ష్మీ కుమార్తెను చూసేందు అమెరికా వెళ్లారు. అక్కడ పని మీద టెక్సాస్ నుంచి డల్లాస్ లోని ఓ ప్రాంతానికి వెళ్తుండగా నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుతో సహా మరో నలుగురు మృతి చెందారు.

ఇక ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక అధికారులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే లోకేశ్ పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మీడియాకి అందుబాటులోకి రాలేదు. మృతదేహాలను అమెరికా నుంచి ఏపీకి తెప్పించే ప్రయత్నంలో ఆయన బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమెరికలోని భారత్ విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. మృతులంతా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంటారు. ఇలా ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom