iDreamPost
android-app
ios-app

వీడియో: యువతిని ఢీకొట్టిన కారు.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి..!

వీడియో: యువతిని ఢీకొట్టిన కారు.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి..!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లలో వచ్చి.. ఎదుటి వాహనాన్ని లేదా వ్యక్తులను ఢీకొడుతున్నారు. ఈ క్రమంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కొన్ని ప్రమాదాలు చూస్తే ఒళ్లుగగ్గురు పుడుతుంది. మనిషిని ఢీకొట్టి.. చాలా దూరం ఈడ్చూకెళ్లడం, అతి ఘోరంగా ఢీకొట్టడం వంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము. తాజాగా నాగ్ పూర్ లో కూడా అలాంటి దారుణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది.  ఓ యువతిని ఢీకొట్టిన కారు..కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం మహారాష్ట్రలోని నాగ్ పుర్ పట్టణంలోని భరత్ నగర్ చౌక్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్నస్కూటీని కారు ఢీకొట్టింది. అనంతరం స్కూటీపై ఉన్న యువతిని కొన్ని కిలోమీటర్ల మేర ఆ కారు ఈడ్చుకెళ్లింది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  స్కూటీని కారు ఈడ్చూకెళ్లడాన్ని గమనించిన స్థానికులు దానిని ఆపే ప్రయత్నం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి అప్పటికే మృతి చెందింది.  ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నిసీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి.  అయితే మృతురాలు ఎవరు, కారులోని వ్యక్తులు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

గతంలోనూ ఢిల్లీ నగరంలో  ఓ యువతిని కారు ఢీకొట్టి.. ఆగకుండా కొన్ని కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఆ ఘటనలో కూడా సదరు యువతి మృతి చెందింది.  ఆ అమ్మాయి మృతి వార్త దేశ వ్యాప్తంగా  చర్చనీయాంశంగా  మారింది. గురువారం ఉదయం కూడా గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు బీభత్సం సృష్టించగా..  అది చూసేందుకు జనాలు గుమిగూడగా.. వారిపై నుంచి ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. నాగ్ పూర్ లో జరిగిన కారు ప్రమాద ఘటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి.. ఇతరుల ప్రాణాలను పోవడానికి కారణమైన వారికి కఠిన శిక్షలు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి. … ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.