P Krishna
ఈ మద్య కాలంలో చాలా వరకు జనాలు చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో చాలా వరకు జనాలు చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
P Krishna
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.. మరికొందరు బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వరుసకు వారు అక్కాతమ్ముడు.. ఏం జరిగిందో తెలియదు కానీ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడటం తీవ్ర కలకం రేపింది.. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహగౌడ్, సోమేష్ గౌడ్ అన్నదమ్ములు. గతంలో వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వలస వచ్చారు. సోమేష్ కు సూర్యాపేట జిల్లాకు చెందిన చామంతి (28) తో 2010 లో వివాహం జరిగింది. ఈ జంట అత్తాపూర్ కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితం గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ ఓ ఇల్లు కొన్నాడు.
మొదటి అంతస్తులో నర్సింహలు, స్వప్న దంపతులు వారి పిల్లలతో ఉంటున్నారు. కింద అంతస్తులో సోమేష్ తన భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు. సోమేష్ షాపులు, ఆఫీస్ లకు నీటి సరఫరా చేస్తూ ఉండగా.. ఆయన భార్య ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నర్సింహులు బావమరిది.. శేఖర్ (25) ఆరు నెలల క్రితం బావ వద్దకు వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు బావలతో ఎంతో సఖ్యతతో కలిసి ఉంటున్నాడు శేఖర్. మంగళవారం ఉదయం సోమేష్, నర్సింహులు, స్వప్న సూర్యాపేటలో ఓ దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్లారు. ఉదయం చామంతి పిల్లలను పాఠశాలకు పంపించింది.
మధ్యాహ్నం పిల్లలు తిరిగి ఇంటికి చేరుకొని తలుపులు కొట్టగా ఎంతకు తీయకపోవడంతో కిటికి లో నుంచి చూశారు. చామంతి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే పక్కింటి వారితో చెప్పడంతో వారు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. హాల్ లో చామంతి, బెడ్ రూమ్ లో శేఖర్ ఉరి వేసుకొని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురు ఆత్మహత్యకు పాల్పపడ్డట్టు ధృవీకరించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.