iDreamPost
android-app
ios-app

బీమా డబ్బు కోసం NRI కోడలిని హత్య చేసిన అత్తమామలు..!

  • Published Jan 29, 2024 | 9:23 PM Updated Updated Jan 29, 2024 | 9:23 PM

అత్తింటికి కోడళ్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. కోడలిని సొంత కూతురులా చూడాల్సిన ఆ అత్త మామలు మాత్రం డబ్బు కోసం దారుణానికి పాల్పపడ్డారు.

అత్తింటికి కోడళ్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. కోడలిని సొంత కూతురులా చూడాల్సిన ఆ అత్త మామలు మాత్రం డబ్బు కోసం దారుణానికి పాల్పపడ్డారు.

బీమా డబ్బు కోసం NRI కోడలిని హత్య చేసిన అత్తమామలు..!

ఇటీవల డబ్బు కోసం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేయడం, బ్లాక్ మెయిలింగ్, ఇల్లీగల్ పనులు ఇలా ఎన్నో రకాలుగా డబ్బు సంపాదిస్తున్నారు. దారుణం ఏంటంటే ఆస్తుల కోసం సొంతవారిని సైతం హతమార్చేందుకు తెగబడుతున్నారు. సాధారణంగా పెళ్లయిన తర్వాత కోడలు అత్తగారింటికి ఎన్నో ఆశలతో వస్తుంది. తన భర్త, అత్తమామలకు సేవ చేస్తుంది. కానీ కొంతమంది అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం కోడళ్లను చిత్ర హింసిస్తుంటారు. కానీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ అత్త మామలు కోడలిని దారుణంగా చంపి.. ఎవరికీ అనుమానం రాకుండా ఫ్రిజ్ లో దాచారు.. కోడలిని ఎందుకు చంపారో తెలిస్తే షాక్ అవుతారు. వివరాల్లోకి వెళితే..

పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జీవిత బీమా డబ్బు కోసం ఓ ఎన్ఆర్ఐ కోడలిని అత్యంత దారుణంగా హతమార్చారు అత్తమామలు. ఆమె మృతదేహాన్ని ఎవరికి అనుమానం రాకుండా ఫ్రిజర్ లో దాచారు. తమ కోడలు గుండెపోటుతో కన్నుమూసిందని జనాలను నమ్మించేందుకు నాటకం ఆడారు. కానీ ఆ మహిళ హత్యకు గురైనట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడింది. అసలు విషయానికి వస్తే.. అమెరికా పౌరురాలైన 32 ఏళ్ల రాజ్‌దీప్ కౌర్ ఐదేళ్ల పాపతో కలిసి జనవరి 12న పంజాబ్ లోని అత్తింటికి వచ్చింది. ఆమె పేరుమీద భారీగా జీవిత భీమా ఉందన్న విషయం అత్తమామలు దల్జిత్ కౌర్, జగదేవ్ సింగ్ తెలుసుకున్నారు. తమ కోడలిని చంపి బీమా డబ్బు సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే జనవరి 19 అర్ధరాత్రి రాజ్‌దీప్ కౌర్ గొంతునొక్కి చంపారు. తర్వాత సిధ్వాడోనా గ్రామంలో రాజ్‌దీప్ కౌర్ మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఫ్రిజర్ లో ఉంచారు.

తమ కోడలు గుండెపోటుతో చనిపోయినట్లు బ్రిటన్ లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే రాజ్‌దీప్ కౌర్ తల్లి నిర్మలా కౌర్ బ్రిటన్ నుంచి భారత్ కి వచ్చింది. తన కూతురు మరణంపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు ఆస్తిని అత్తమామలు స్వాధీనం చేసుకున్నారని.. పెళ్లి వేడుకల పేరుతో రప్పించి బీమా డబ్బు కోసం హతమార్చారని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. రాజ్‌దీప్ కౌర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆమె గొంతు నొక్కి ఊరికి ఆడకుండా చేసి చంపినట్లు రిపోర్టు రావడంతో అత్తమామలతో పాటు ఆమె భర్త మంజిందర్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.