iDreamPost
android-app
ios-app

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య!

  • Published Dec 20, 2023 | 3:16 PM Updated Updated Dec 20, 2023 | 3:16 PM

వివాహేతర సంబంధాలతో క్షణిక సుఖం కోసం నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.. పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

వివాహేతర సంబంధాలతో క్షణిక సుఖం కోసం నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.. పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

  • Published Dec 20, 2023 | 3:16 PMUpdated Dec 20, 2023 | 3:16 PM
ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య!

పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట.. కొద్ది రోజుల్లోనే విడిపోతున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వీటికి కారణాలు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, ఆదిపత్య విషయంలో తేడాలు, వివాహేతర సంబంధాలు అంటున్నారు పోలీసులు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. వారి కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నాయి. పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువే అయ్యాయి. తాజాగా ఓ వివాహిత తన అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

వీరులపాడు గ్రామానికి చెందిన యాదల శ్రీనివాస్ రావు అలియాస్ ఏలియా కొంతకాలంగా పాస్టర్ గా జీవిస్తున్నాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ వారితో మమేకమయ్యేవాడు. శ్రీనివాసరావు ఎప్పటిలాగే సోమవారం వేరే గ్రామానికి వెళ్లి రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య వాణి వేరే వ్యక్తితో చూడకూడని పరిస్థితిలో కనిపించింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాసరావు భార్య వాణిపై చేయి చేసుకున్నాడు. తాను పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భర్తకు తెలియడం.. అతను పదిమందితో అంటే తన పరువు పోతుందని వాణి దారుణమైన నిర్ణయం తీసుకుంది.

తన ప్రియుడితో కలిసి కేబుల్ వైర్ తో శ్రీనివాస్ రావు మేడకు ఉరి బిగించి భర్తను చంపేసింది. శ్రీనివాసరావుడు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత తన ప్రియుడిని అక్కడ నుంచి పంపించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వాణి తన భర్త చనిపోయాడని.. కొంతకాలంగా ఆయన మానసికంగా బాధపడుతున్నాడని, ఇద్దరు వేర్వేరు గదుల్లో పడుకున్నామని తెలిపిందే. ఉదయం లేచి చూసే సరికి తన భర్త చనిపోయి ఉన్నాడని గ్రామస్థులను నమ్మబలికింది. కానీ అప్పటికే స్థానికులకు వాణిపై ప్రవర్తనపై అనుమానం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. వాణిని అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom