ఉరి వేసుకొని వివాహిత బలవన్మరణం… కారణం అదేనా!

ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి వెంటనే మనస్థాపానికి గురైతున్నారు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల తీవ్రమైన మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పపడుతూ కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. తాజాగా ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా నేరేడు‌చర్ల మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న దిరావత్ వీర్యానాయక్ భార్య శ్రీదేవి.. వయసు 35 సంవత్సరాలు. వీరికి ఇద్దరు పిల్లలు కార్తీక్, సాత్విక్ లు ఉన్నారు. వీర్యా నాయక్ పెంచికల్‌దిన్న గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇటీవల శ్రీదేవి మానసికంగా కృంగిపోతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీదేవి ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. వీర్యానాయక్ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు.  తలుపు ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సహకారంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడటంతో శ్రీదేవి ఫ్యాన్ వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది.

పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శ్రీదేవి రాసిన సూసైడ్ లేటర్ ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీదేవి తల్లిదండ్రులు బిక్య హరిలాల్, కమలమ్మ గుడిబండతండాలో ఉంటున్నారు. శ్రీదేవి సోదరి సునిత.. ప్రస్తుతం ఆమె సూర్యాపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఇటీవల అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. శ్రీదేవి తల్లిదండ్రులు కానిస్టేబుల్ సునితకే ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడంతో శ్రీదేవి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శ్రీదేవి భర్త వీర్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Show comments