iDreamPost
android-app
ios-app

ప్రేమ పేరుతో యువకుడి మోసం.. తీవ్ర నిర్ణయం తీసుకున్న మైనర్!

  • Published Dec 27, 2023 | 12:58 PM Updated Updated Dec 27, 2023 | 12:58 PM

ఆడవాళ్లపై రోజు రోజుకీ లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. యువతులను ప్రేమ పేరుతో వంచింది అవసరం తీరిన తర్వాత దారుణంగా హతమారుస్తున్నారు.

ఆడవాళ్లపై రోజు రోజుకీ లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. యువతులను ప్రేమ పేరుతో వంచింది అవసరం తీరిన తర్వాత దారుణంగా హతమారుస్తున్నారు.

  • Published Dec 27, 2023 | 12:58 PMUpdated Dec 27, 2023 | 12:58 PM
ప్రేమ పేరుతో యువకుడి మోసం.. తీవ్ర నిర్ణయం తీసుకున్న మైనర్!

ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కామాంధులు వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లపై రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ అత్యాచారలు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కొంతమంది ప్రేమ పేరుతో వంచించి తమ అవసరం తీరిన తర్వాత దారుణంగా హత్యలకు తెలగబడుతున్నారు. కొతమంది మంది యువతులు ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యలకు పాలప్పపడుతున్నారు. ఓ నయవంచకుడి మాయమాటలు నమ్మిన యువతి.. ప్రేమలో పడింది. అవసరం తీరిన తర్వాత దారుణంగా మోసం చేశాడు.. ఈ  ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నాగర్ కర్నూల్ లింగసాని పల్లె గ్రామానికి చెందిన బోనాసి కృష్ణయ్య, జయమ్మ దంపతుల కూతురు కావ్య (17). జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పారామెడికల్ కాలేజ్ లో చదువుతుంది. కావ్య తల్లి నాలుగేళ్ల క్రితం ఓ ప్రమాదంలో మరణించింది. అప్పటి నుంచి కూతురుని కంటికి రెప్పలా సాకుతున్నాడు కృష్ణయ్య. అదే గ్రామానికి చెందిన బోనాసి శివుడు (24) కావ్యకు బాబాయ్ వరుస అవుతాడు. కొంతకాలంగా కావ్యపై కన్నేసి ఆమె చదువుకునే కాలేజ్ కి వెల్లి తనను ప్రేమించాలని వేధించేవాడు. ఈ విషయం తన తండ్రి కృష్ణయ్యకు చెప్పింది కావ్య. పెద్దమనుషుల్లో పెట్టి మరోసారి కావ్య జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తీర్మాణం చేశారు.

A young man's deception in the name of love

కావ్య అందరి ముందు తన పరువు తీసిందన్న కక్ష్య పెంచుకున్నాడు శివుడు. మళ్లీ కావ్యను కలిసి మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. అంతేకాదు జీవితాంతం సుఖంగా చూసుకుంటానని.. మన పెళ్లికి మీ నాన్న, పెద్దలు అంగీకరించరని చెప్పాడు. మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం.. కుదరకుంటే కలిసి చనిపోదాం అని కావ్యతో చెప్పాడు. శివుడి మాటలు గుడ్డిగా నమ్మంది కావ్య. ఈ నెల 23న ఇద్దరూ ఇంటికి చేరుకొని తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు ముందుగా బాలికకు తాగించి అక్కడ నుంచి పరారయ్యాడు. తన కూతురు పరిస్థితి గమనించిన కృష్ణయ్య వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తరలించారు. అప్పటికే కావ్య పరిస్థితి విషమంగా మారింది.. చికిత్స పోందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై తండ్రి బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.