iDreamPost

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు.. తాంత్రిక పూజల పేరుతో 11 హత్యలు..!

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ గుప్త నిధుల పేరిట దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తున్నారు. కొన్నిచోట్ల నరబలి పేరిట దారుణాలకు పాల్పపడుతున్నారు.

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ గుప్త నిధుల పేరిట దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తున్నారు. కొన్నిచోట్ల నరబలి పేరిట దారుణాలకు పాల్పపడుతున్నారు.

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు.. తాంత్రిక పూజల పేరుతో 11 హత్యలు..!

ప్రపంచం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుంది. మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చనిపోయిన మనిషికి ప్రాణం పోయడం తప్ప అన్నీ విషయాల్లో విజయం సాధించాడు. అంతరిక్షాన్ని శాసిస్తున్నాడు.. మనిషికి శ్రమ లేకుండా ఎన్నో వస్తువులు కనిపెడుతున్నాడు. ఇన్ని చేస్తున్నా ఒక్క విషయలో ఓడిపోతున్నాడు.. అదే మూఢ విశ్వాసం. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు, క్షుద్ర పూజలు, దెయ్యాల పేర్లు చెప్పి దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గుప్త నిధులు విషయంలో ఇప్పటికీ కొంతమందికి నమ్మకాలు ఉన్నాయి. పూర్వికులు బావులు, పురాతన గుహలు, పొలాలు,  గృహాల్లో గుప్త నిధుల దాచి ఉంచారని ప్రజలను మోసం చేస్తూ అందినంత డబ్బులు దండుకుంటున్నారు. ఓ వ్యక్తి తాంత్రిక పూజల పేరు తో ఏకంగా 11 మంది ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నాగర్‌కర్నూల్ జిల్లాలో తాంత్రిక పూజల పేరుతో పదకొండు మందిని దారుణంగా హతమార్చిన నర హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇళ్లు, పురాత గుడులు, పొలాలు చూపించి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి బాధితులను మోసగించి వారి ద్వారా భారీ మొత్తంలో వసూళ్లు చేయడం, డబ్బు లేని వారి వద్ద స్థిరాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని.. గప్త నిధులు దొరికిన తర్వాత డబ్బు తీసుకొని తిరిగి వారి ప్రాపర్టీ వారికి ఇస్తానని నమ్మబలికి.. అనంతరం పూజల పేరుతో సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి హతమార్చడం చేస్తుంటాడు.   ఒక బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదులో ఈ నర హంతకుడి బండారం బయటపడింది. వనపర్తి జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. కొన్నిరోజులుగా ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు.. చివరిగా నాగర్ కర్నూల్ కు వెళ్లడంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాలు చూసి ఆశ్చర్యపోయారు.. గతంలో ఇలాంటి ఫిర్యాదులే రావడంతో కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. దర్యాప్తులో ఈ కేసులకు ఒకే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు అనుమానించారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.

మంగళవారం నాగర్ కర్నూల్ నరహంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హంతకుడిని గద్వాల జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘11 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నర హంతకుడి పేరు రామటి సత్యనారాయణ. నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రా నగర్ నివాసి. అతని ఇంట్లో ఎంక్వేయిరీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఇంటి నుంచి విషపదార్ధాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఫోన్లు, సిమ్ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నాం. గుప్త నిధుల పేరుతో నిర్మానుశ్య ప్రదేశాలకు తీసుకువెళ్లి తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపుతాడు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వాటిని కోర్టులో ప్రవేశ పెడతాం.. ఇలాంటి మోసగాళ్ళ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అన్నారు. ఇలాంటి మోసగాళ్ల విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి