P Krishna
ఈ మద్య చాలా వరకు వివాహేతర సంబంధాల వల్ల పచ్చని సంసారాలు నిలువునా కూలిపోతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు.
ఈ మద్య చాలా వరకు వివాహేతర సంబంధాల వల్ల పచ్చని సంసారాలు నిలువునా కూలిపోతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు.
P Krishna
ఇటీవల దేశంలో వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. పెద్దల సమక్షంలో మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంట పట్టుమని ఒక్క సంవత్సరం కాపురం చేయకుండానే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇందుకు కారణం ఆర్థిక సమస్యలు కొన్ని అయితే.. వివాహేతర సంబంధాల వల్ల విడిపోతున్నారు. కొంతమంది అక్రమ సంబంధం నేపథ్యంలో ఒకరినొకరు చంపుకొని పిల్లలను అనాథలను చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు ఆనందంగా సాగిపోతున్న సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ భార్య చేసిన నీచమైన పనికి భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అప్పట్లో తెలుగులో రిలీజ్ అయిన ఆరుగురు పతివ్రతలు మూవీ గుర్తుందా? అందులో పెళ్లయిన ఓ మహిళ భర్తను కాదని పరాయి వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకు తెలియకుండా కొంతకాలం మెయింటేనే చేస్తుంది.. ఇది తెలిసిన భర్త ఆమెను నిలదీస్తాడు. దీంతో ఆ ఇంటివాళ్లు ఓ కండీషన్ పెడతారు.. భర్త, ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని.. అచ్చం అలాంటి సీన్ ఒకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య వేరే కాపురం పెట్టింది. ఈ క్రమంలోనే భర్త తనతో పాటు ఉండాలంటే ఓ దారుణమైన కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ విన్న భర్త మనస్థాపానికి గురైన బలవన్మరణానికి పాల్పపడ్డాడు. ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశి, వయసు 29 ఏళ్లు. ఐదు సంవత్సరాల క్రితం గోకినేపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన కొంత కాలం ఈ జంట ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. ఈ జంటకు ఒక కుమారుడు. కొంత కాలంగా సదరు మహిళ ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో అతనికి దూరంగా ఉంటూ వేరే కాపురం పెట్టింది. గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలోనే భార్య.. భర్తకు ఓ కండీషన్ పెట్టింది. తాను ప్రియుడితో కాపురం చేసుకుంటాను.. ఇష్టమైతే నువు కూడా వచ్చి నాతో ఉండు ముగ్గురం కలిసి ఉందాం అని చెప్పింది. ఆ కండీషన్ విన్న గుండాల వంశి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. చనిపోయే ముందు వాట్సాప్ లో సెల్ఫీ వీడియో పంపించడంతో మృతుడి తండ్రి గుండాల శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.