P Krishna
P Krishna
వేద మంత్రాల సాక్షిగా, పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలు అవుతారు. భార్యా భర్తలను నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ ఆనందంగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఈ మద్య కాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల పెళ్లైన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. నూరేళ్లు తోడుంటానని చెప్పి ప్రమాణం చేసిన కొంతమంది భర్తలు అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అదనపు కట్నం తీసుకురావాలని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని నీమూచ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీమూచ్ గ్రామానికి చెందిన రాకేష్ కిర్ అనే వ్యక్తం గత కొంత కాలంగా తన భార్యను అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా వేధిస్తూ వచ్చాడు. తన తల్లిదండ్రులు పేదవాళ్లు అని.. అదనపు కట్నం తీసుకురాలేని రాకేష్ భార్య ప్రాదేయపడుతూ వచ్చింది. కానీ రాకేష్ కీర్ కృరమైన ఆలోచనతో గత నెల 20న భార్య ఉషను తాళ్లతో కట్టి బావిలోకి వదిలాడు… బావిలో ఆమె కాపాడండీ అంటూ విలవిలలాడుతుండగా ఆ తతంగాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.
తాను చేసి దారుణాన్ని ఉష పుట్టింటి వారికి, బంధువులకు పంపించాడు. వెంటనే వారు గ్రామానికి చేరుకుని స్థానికులను తమ కూతురిని రక్షించాల్సిందిగా ప్రార్థించారు. కానీ.. అప్పటికే ఉష బావిలో ఊరి ఆడక చనిపోయింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు రాకేష్ కి దేహశుద్ది చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు రాకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూ.5 లక్షల రూపాయలు అదనంగా కట్నం కావాలని ఉషని వేధించానని.. తాను అదనపు కట్నం తీసుకురాలేనని చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే ఆమెను చంపినట్లు నిందితుడు రాకేష్ పోలీసులకు తెలిపారు.