iDreamPost
android-app
ios-app

లైన్ మెన్ తో అక్రమ సంబంధం.. చివరికి ఏమైందంటే..?

  • Published Dec 19, 2023 | 11:46 AM Updated Updated Dec 19, 2023 | 11:46 AM

ఈ మద్య వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సంతోషంగా ఉండే ఎన్నో కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి.

ఈ మద్య వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సంతోషంగా ఉండే ఎన్నో కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి.

  • Published Dec 19, 2023 | 11:46 AMUpdated Dec 19, 2023 | 11:46 AM
లైన్ మెన్ తో అక్రమ సంబంధం.. చివరికి ఏమైందంటే..?

వేద మంత్రాల సాక్షిగా.. బంధు మిత్రుల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి జీవించాలిని ఆశీర్వదిస్తారు పెద్దలు. కానీ ఈ మద్య పెళ్లైన ఏడాది గడవక ముందే పలు కారణాలతో దంపతులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గ్రామాల్లో పెద్దల సమక్షంలో విడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల పెళ్లైన కొంతకాలానికే మూడుముళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి ఓ ఘటన మైసూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మైసూర్ చామరాజనగర జిల్లాలోని కొళ్లేగాలలో రేఖ (29) అనే మహిళ కొంత కాలంగా ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా మరణించడం, ఆమె కూతురు కనిపించకుండా పోవడంత తీవ్ర కలకలం రేపింది. శనివారం సాయంత్రం కొళ్లేగాల పట్టణం ఆదర్శనగర్ లో ఒక ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో రేఖ అనే మహిళ మృతదేహం కనిపించింది. ఆమె ఆరేళ్ల కూతురు మాన్విత కనిపించకుండాపోయింది. వారం రోజులుగా మాన్విత స్కూల్ కి రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచర్.. రేఖ కి ఫోన్ చేసింది. కానీ రేఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో టీచర్ నేరుగా రేఖ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు రేఖ ఇంటికి చేరుకొని అన్ని విధాలుగా పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. బంధువులు అడ్డుకున్నారు. నేరస్తులను పట్టుకునే వరకు మృతదేహాన్ని ఎక్కడికి కదిలించేది లేదని పట్టుబట్టారు. చివరికి పోలీసులు సర్ధిచెప్పడంతో వదిలివేశారు.  రేఖ.. కేఈబీ లైన్‌మెన్ నాగేంద్ర అలియాస్ ఆనంద్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం రేఖ భర్త సునీల్ కి తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. కానీ వారి తీరులో మార్పు రాకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త లేకపోవడంతో నాగేంద్రతో ఆ ఇంట్లోనే సహజీవనం చేస్తుంది రేఖ. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా నాగేంద్ర-రేఖ మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఈ కారణంతోనే రేఖను చంపి ఆమె పాప మాన్వితను తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నాగేంద్ర, పాప కోసం గాలిస్తున్నారు.