P Krishna
Kanyakumari Crime News: ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ఫలితంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.
Kanyakumari Crime News: ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ఫలితంగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.
P Krishna
ఇటీవల చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఎదుటి వారిపై దాడులు, హత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల గొడవలు జరగడం.. మనస్థాపానికి గురి కావడవం వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కనీ పెంచిన తండ్రిని ఓ కూతురు అత్యంత దారుణంగా హతమార్చింది.. ఆ తప్పను కప్పిపుచ్చుకునేందుకు వరుసగా తప్పులు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్యాకుమారి జిల్లా పుదప్పాండికి చెందిన సుకేష్ కుమార్ (46) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. మృతుడు సురేష్ కుమార్ కి పెళ్లై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెళ్లైన కొత్తలో భారాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు. కొంత కాలంగా సురేష్ కి మద్యం అలవాటు కావడంతో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే భార్య చిన్న కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద కూతురు మాత్రం తండ్రి వద్దనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత 26వ తేదీన సురేష్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆయన కూతురు పై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు.
మృతుడు సురేష్ కుమార్ పెద్ద కూతురు ని పోలీసులు విచారణ చేశారు. మద్యం మత్తులో తన తండ్రి చనిపోయాడని తెలిపింది. పోస్ట్ మార్టంలో తలకు బలమైన గాయం ఉండటంతో కూతురిని తమదైన శైలిలో ప్రశ్నించారుపోలీసులు. దీంతో అసలు నిజం బయటపెట్టింది.. తన తండ్రిని తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది కూతురు. తన తండ్రి ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడని, తనపై దాడి చేసే వాడని తెలిపింది. ఘటనకు ముందు కూడా తనపై దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో తన తండ్రిని నెట్టివేడయంతో గొడకు తల తగిలి గాయం ఏర్పడినట్లు తెలిపింది. మరుసటి రోజు కూడా తనని తిట్టడం, దాడియి యత్నంచడం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై గొంతునులిమి చంపినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు.