iDreamPost
android-app
ios-app

పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!

  • Published Nov 18, 2023 | 3:46 PM Updated Updated Nov 18, 2023 | 3:46 PM

దేశంలో ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

దేశంలో ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!

ఇటీవల దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అవగాహన లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. ఇలా ఎన్నో తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రైవర్లలో మార్పు రావడం లేదు. తాజాగా పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిన్నారుల సహ ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వారంతా పెళ్లికి వెళ్లి ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు.. అంతలో ఆ కుటుంబాలను మృత్యువు కబలించింది. జార్ఖండ్ లోని థోరియా గ్రామానికి చెందిన టికోడిహ్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తాము తీసుకువెళ్లిన ఎస్‌యూవీ కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. శనివారం తెల్లవారు జామున కారు గిరిధి జిల్లాలోని బగ్మారాలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే అదుపు తప్పింది.  అత్యంత వేగంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ దాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగుర తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

కారులో ఇరుక్కు పోయిన వారందరినీ బయటకు తీశారు. తీవ్రంగా గాపడ్డ వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్రం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో పది మంది వరకు ఉన్నారని.. ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే కన్నుమూశారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల సహా పలువురుకి గాయాలు అయినట్లు తెలిపారు. డ్రైవర్ అతివేగంగా రావడం వల్ల కారును నియంత్రించలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని, ప్రమాదం సమయంలో పెద్ద శబ్ధం రావడంలో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని స్థానికులు అంటున్నారు.