iDreamPost
android-app
ios-app

పండగ పూట విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి!

పండగ పూట విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి!

దేశ వ్యాప్తంగా శనివారం మొహరం పండుగను ప్రజలందరూ కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింలు కొత్త దుస్తులు ధరించి మసీదులకు వెళ్లిని ప్రార్ధనలు చేస్తున్నారు. అలానే పీర్ల ఎత్తి ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఊరు వాడ మొహరం పండుగను సంతోషంగా జరుపుకుంటుంది. అయితే పండగవేళ జార్ఖండ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మొహరం పండగ వేళ నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో  హై టెన్షన్ వైర్ తగిలి నలుగురు మృతిచెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోనే  ఖేత్కో అనే గ్రామంలో  అందరు ఘనంగా మొహరం పండగను నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి.. మసీదులకు వెళ్లి.. ప్రార్ధనలు చేశారు. అలానే పండగ సందర్భగా  గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  తాజీయా, మసీద్ లను ఊరేగింపు  చేశారు. ఈ  వేడుకలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. అందరు సంతోషంగా అల్లా స్మరణ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. వారు ఊరేగిస్తున్న తాజీయా.. హైటెన్షన్ వైర్లకు తాకింది.

దీంతో దానిని పట్టుకున్న వారికి కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో నలుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పండగ వేళ ఈ ఘోరంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘోర విషాదాలు జరగకుండా నివారణ చర్యలు ఏం తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  దారుణం: బైక్‌కు కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..