భార్యను దారుణంగా చంపి.. కనిపించడం లేదని హైడ్రామా!

ఈ మద్య కాలంలో చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లి ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు హత్యలకు దారి తీస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

ఈ మద్య కాలంలో చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లి ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు హత్యలకు దారి తీస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

పెద్దల సమక్షంలో.. వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గ్రామాల్లో అయితే పెద్దల సమంక్షంలో మూడుముళ్ల బంధానికి శుభం కార్డు పలుకుతున్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య నెలకొంటున్న చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలినవానగా మారి విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఒక ఎత్తైతే.. వివాహేతర సంబంధాలు సైతం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తన భార్యను చంపి కనిపించడం లేదని డ్రామాలు ఆడిన భర్త గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్లు కలిసి మెలిసి తనతో గడిపిన జీవిత భాగస్వామిని అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. తన భార్యతో కలిసి ఫంక్షన్ కి వెళ్లాం.. అక్కడే ఆమె కనిపించకుండా పోయిందని డ్రామాలు ఆడాడు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రాజేశ్వరి (38) కి రుద్రురుకు చెందిన రాజేశ్ తో 2005 లో పెళ్లైంది. కొంతకాలం అక్కడే కాపురం చేసిన ఈ జంట తర్వాత హైదరాబద్ కి వచ్చి మియాపూర్ లో ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. బోధన్ లో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు.

గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. పెద్దలు వచ్చి సర్ది చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాజేశ్ తన భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్మార్గపు ఆలోచన ఆలోచించాడు. ఈ నెల 10న గండిమైసమ్మ ప్రాంతంలతో ఓ ఫంక్షన్ ఉందని భార్యను నమ్మించాడు. రాజేశ్వరి భర్త చెప్పిన మాటలు అమాయకంగా నమ్మి బైక్ పై వెళ్లింది. బౌరంపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకువెళ్లి బండరాయితో మోది దారుణంగా హత్యచేశాడు. పక్కన ఉన్న కాల్వలో రాజేశ్వరి మృతదేహాన్ని పడవేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. రెండు రోజుల తర్వాత రాజేవ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి తన భార్య కనిపించడం లేదు.. బయటికి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని చెప్పాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో రాజేశ్వరి తల్లికి అనుమానం రావడంతో ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజేశ్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం బయటపెట్టాడు. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు పోలీసులు. రాజేశ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Show comments