iDreamPost
android-app
ios-app

TV సీరియల్ మేకప్ మెన్ పై దారుణం.. ఏం జరిగిందంటే!

  • Published May 16, 2024 | 11:34 AMUpdated May 16, 2024 | 11:34 AM

Hyderabad Crime News:ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇలా ఎన్నో కారణాల వల్ల హత్యలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

Hyderabad Crime News:ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇలా ఎన్నో కారణాల వల్ల హత్యలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

  • Published May 16, 2024 | 11:34 AMUpdated May 16, 2024 | 11:34 AM
TV సీరియల్ మేకప్ మెన్ పై దారుణం.. ఏం జరిగిందంటే!

ఈ మద్య హైదరాబాద్ లో పలు చోట్ల హత్యలు, దోపిడీలు నగరవాసులకు భయాందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నా.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ దుండగులు సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి.. అవి కాస్త చిలికి చిలికి గాలివానగా మారి హత్యలకు దారి తీస్తున్నాయి. మరికొంతమంది తమ ప్రత్యర్థులను హతమార్చేందుకు ప్రొఫెషనల్ కిల్లర్స్ కి సుపారి ఇచ్చి మరీ హత్యలు చేయిస్తున్నారు. హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్ మేకప్ మెన్ గా పనిచేసే యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని నిమ్స్ మే మైదానంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సమాచారం మేరకు కార్మిక నగర్ చిల్లా వద్ద ఉన్న నిమ్స్‌మే గ్రౌండ్ లోపల ఓ ప్రహారి గోడ వద్ద యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు బుధవారం సమాచారం అందింది. వెంటనే ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ తన బృందంతో సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఓ యువకుడు మృతదేహం కనిపించింది. మృతుడు టీవీ సీరియల్స్ మేకప్ మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిసిందే.

మృతుడు మహబూబ్ నగర్ వనపర్తి ప్రాంతానికి చెందిన చుక్కా చెన్నయ్య అలియాస్ తరుణ్ తేజ్ (28) గా గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రప్పించి ఆధారాలు సేకరించారు. తరుణ్ తేజ్ ని ఎవరో దుండగులు వెంట తరిమి మారణాయుధాలతో దాడి చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే మృతుడు తరుణ్ తేజ్ తో మంగళవారం రాత్రి నిమ్స్ మే మైదానంలోకి ఎవరు వచ్చారు? ఎలా వచ్చారు? అసలు ఏం జరిగింది? అన్న వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం కార్మిక నగర్ బస్టాప్, శ్రీరాంనగర్ లో ఉన్న సీసీకెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి