iDreamPost
android-app
ios-app

మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం దొరికింది! అసలు ఏం జరిగిందంటే?

  • Published Jan 13, 2024 | 5:01 PM Updated Updated Jan 13, 2024 | 5:01 PM

ఇటీవల గుర్గావ్ హూటల్ లో ఓ మోడల్ ని కాల్చి మృతదేహాన్ని మాయం చేశారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు చేశారు.

ఇటీవల గుర్గావ్ హూటల్ లో ఓ మోడల్ ని కాల్చి మృతదేహాన్ని మాయం చేశారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు చేశారు.

మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం దొరికింది! అసలు ఏం జరిగిందంటే?

ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు  యువతులతో రిలేషన్ షిప్ కొనసాగించి.. అవసరం తీరిన తర్వాత వారిని దారుణంగా హతమార్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దారుణమైన విషయం ఏంటంటే.. చదువుకున్న అమ్మాయిలు, మోడల్స్, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే ఎక్కువ బలి అవుతున్నారు. ఢిల్లీలో టెలీ కాలర్ గా పనిచేస్తున్న శ్రద్దా వాఖర్ అనే యువతిని ప్రేమ పేరుతో వంచించి అత్యంత దారుణంగా ముక్కలు గా నరికి అడవిలో పడవేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఈ ఏడాది జనవరి 2న గుర్గావ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య వహుజా అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

గుర్గావ్ హూటల్ లో అనుమానాస్పదంగా హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) హత్య కేసు ఎట్టకేలకు వీడింది. శనివారం ఉదయం ఫతేమాబాద్ జిల్లా తోహానాలోని భాక్రా కాలువ నుంచి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజ్ ప్రతాప్ తెలిపారు. మృతదేహం ఆచూకీ కోసం వంద మంది గురగ్రామ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కాగా, దివ్య పహుజా మృతదేహాన్ని ఆమె టాటూల ద్వారా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అసలు మాజీ మోడల్ దివ్య పహుజా ఎవరు? ఎందుకు ఆమెను హత్య చేసి ఎక్కడో కాలువలో పడవేశారు? విషయం గురించి తెలుసుకుందాం. ముంబై గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ గర్ల్ ఫ్రెండ్ దివ్య పహుజా. 2016లో సందీప్ గడోలీ ఎన్ కౌంటర్ జరిగింది.  ఆ కేసులో అరెస్ట్ అయిన దివ్య పహుజా ఆరేళ్లపాటు జైలు శిక్ష అనుభవించింది. గత ఏడాది జూన్ లో జైలు నుంచి రిలీజ్ అయ్యింది.

గుర్గావ్ హూటల్ సీసీ టీవీ ఫుటేజ్ లో దివ్య పహుజా మృతదేహాన్ని లాక్కెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు హూటల్ యజమాని అభిజిత్ సింగ్, ప్రకాశ్, ఇంద్రజ్ ని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన అభిజిత్ పలు సంచనల విషయాలు వెల్లడించారు. గతంలో వ్యాపారి అభిజిత్ తో దివ్య పహుజ రిలేషన్ షిప్ లో ఉండే సమయంలో అతనితో ఏకాంతంగా ఉన్న వీడియో, ఫోటోలు తన వద్ద ఉంచుకొని తరుచూ అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుండేదని.. వాటిని డిలీట్ చేయాలని ఎంతగా బ్రతిమలాడినా ఒప్పుకోకపోవడంతో తనను కాల్చి చంపినట్లు అభిజిత్ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. నిందితుల్లో ఒకరైన బాల్ రాజ్ గిల్ మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడవేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో మరో ప్రధాన నింధితుడు రవి బంగా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.