iDreamPost
android-app
ios-app

వీడియో: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. యువకుడిపై దారుణం

  • Published May 16, 2024 | 5:22 PM Updated Updated May 16, 2024 | 5:22 PM

Gurugram Crime News: సాధారణంగా పార్కింగ్ విషయాల్లో తరచూ గొడవలు పడటం చూస్తూనే ఉంటాం. ఇలాంటి గొడవల్లో కొట్టుకోవడం.. హత్యలు జరిగిన సందర్బాలు ఉన్నాయి.

Gurugram Crime News: సాధారణంగా పార్కింగ్ విషయాల్లో తరచూ గొడవలు పడటం చూస్తూనే ఉంటాం. ఇలాంటి గొడవల్లో కొట్టుకోవడం.. హత్యలు జరిగిన సందర్బాలు ఉన్నాయి.

వీడియో: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. యువకుడిపై దారుణం

ఈ మద్య చాలా మంది చిన్న చిన్న కారణాలకే తీవ్ర మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు హత్యలకు పాల్పపడుతున్నారు. సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు బస్తీల్లో పార్కింగ్ విషయంలో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. అప్పటి వరకు ఇవి చిన్న విషయమే అయా.. కొన్నిసార్లు చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. పార్కింగ్ విషయంలో కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలు జరిగి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ఇటీవల గురు గ్రామ్ లో చోటు చేసుకుంది. పార్కింగ్ విషయంలో గొడవ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని గురు గ్రామ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మే 12న రిషబ్ బసూజా (31) అనే యువకుడిని పక్క అపార్ట్ మెంట్ లో నివసించే మనోజ్ దారుణంగా చంపాడు. రిషబ్ జసూకా మిలీ అతని సోదరుడిని కారుతో ఢీ కొట్టి కొన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకు వెల్లాడు. ఈ ఘటనలో రిషబ్ గాయాలు కావడంతో కన్నుమూశాడు. రిషబ్ సోదరుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో రిషబ్ తల్లి కి కూడా స్వల్పంగా గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి ఫ్యామిలీతో కలిసి వచ్చిన రిషబ్ కి పక్కనే ఉన్న మనోజ్ కి పార్కింగ్ విషయంలో గొడవ జరగింది. ఈ క్రమంలోనే మనోజ్ కొంతమంది స్నేహితులను పిలిపించి రిషబ్ ఫ్యామిలీపై దాడి చేయించాడు. అంతటితో ఆగకుండా తన కారుతో రిషబ్ తో సహా అతని సోదరుడు, తల్లిని ఢీ కొట్టి ఈడ్చుకు వెళ్లాడు.

ఈ క్రమంలోనే రిషబ్ చనిపోగా.. చికిత్స పొందుతున్న అతని సోదరుడి పరిస్థితి దారుణంగా ఉందని.. ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రిషబ్ తల్లికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఈ దారుణ దృష్యం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు మనోజ్ భరద్వాజ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నింధితుడు మనోజ్ పరారీలో ఉండగా.. త్వరలో అతన్ని పట్టుకొని శిక్షిస్తామని తెలిపారు పోలీసులు.