iDreamPost
android-app
ios-app

సీరియల్ కిల్లర్ దారుణం! భార్యతో సహా.. 42 మంది మహిళలను!

ఇటీవల ఓ ప్రాంతంలో తొమ్మిది మంది మహిళ మృతదేహాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఆ హత్యలకు కారణమైన సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనలో విస్తుతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల ఓ ప్రాంతంలో తొమ్మిది మంది మహిళ మృతదేహాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఆ హత్యలకు కారణమైన సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనలో విస్తుతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సీరియల్ కిల్లర్ దారుణం! భార్యతో సహా.. 42 మంది మహిళలను!

నిత్యం అనేక ఘోరమైన ఘటనలు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. కొన్ని కొన్ని ఘటనలు చదివినప్పుడు ఒంట్లో వణుకు పుడుతుంది. అంతేకాక ఇలాంటి క్రూరమైన మనుషులు కూడా ఉంటారా అనే సందేహం రాకమానదు. కొందరు సైకోలు ఆడవారిని, పసిపిల్లలను కిడ్నాప్ చేసి..దారుణంగా హత్య చేస్తుంటారు. అంతేకాక పోలీసులకు సైతం చిక్కకుండా ఏళ్ల పాటు ఇలాంటి ఆకృత్యాలు చేస్తుంటారు. తాజాగా ఓ దారుణమైన ఘటన బయటపడింది. చెత్తను డంబ్ చేసే  ఓ క్వారీలో కుళ్లిన స్థితిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉల్కికి పడింది. ప్రభుత్వం కూడా అలెర్ట్ అయి.. ఆ ఘటనపై సీరియస్ గా స్పందించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కెన్యా రాజధాని నైరోబీలోని చెత్త డంప్ చేసే ఓ క్యారీలో ఛిద్రమైన స్థితిలో తొమ్మిది మంది మహిళలు బయటపడ్డాయి. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మహిళను హత్య చేసిన కాలిన్స్ జోమైసి ఖలుషా అనే సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా ఒళ్లు గగురుపొడిచే విషయాలను వెల్లడించాడు.

2022 నుంచి ఇప్పటి వరకు  తన భార్యతో సహా 42 మంది మహిళలను చంపినట్లు అంగీకరించాడు. మహిళలను ప్రలోభ పెట్టి…తన అవసరం తీర్చుకున్న తరువాత హత్య చేశాడు. అనంతరం వారి మృతదేహాలను డంపింగ్ యార్డులో పడేసినట్లు ఒప్పుకుడున్నాడని కెన్యా దేశ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ మహమ్మద్ అమీన్ అన్నారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అతడు రెండేళ్ల వ్యవధిలో 42 హత్యలు చేశాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడి ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 10 ఫోన్లు, ల్యాప్‌టాప్, గుర్తింపు కార్డులు, మహిళల దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నతెలిపిన పోలీసులు కొన్ని మీడియాకు ప్రదర్శించారు.

మహిళలను, అమ్మాయిలను చంపేందుకు కొడవలి, అనంతరం మృతదేహాలను పారేసేందుకు ఉపయోగించే బస్తాలను పోలీసులు కనుగొన్నారు. వివిధ దశల్లో కుళ్లిన మృతదేహాలు కనిపించిన డంప్‌సైట్ లో పోలీసులు గుర్తించారు. మృతలందరూ 18 నుంచి 30 ఏళ్ల మధ్యవారేనని, అందరూ ఒకే విధంగా హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. గతేడాది కూడా హిందూ మహాసముద్ర తీర పట్టణమైన మాలిండిలో డూమ్స్‌డే కల్ట్‌తో సంబంధం ఉన్న వందలాది మంది వ్యక్తుల అవశేషాలు బయటపడటంతో కెన్యన్లు భయభ్రాంతులకు గురయ్యారు. తాజాగా ఈ ఘటనతో మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సైకో కిల్లర్ ను కఠినంగా శిక్షించాలనే స్థానికులు కోరుతున్నారు.