iDreamPost
android-app
ios-app

ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడింది.. కానీ ఆ తప్పే ఆమె ప్రాణం తీసింది!

ఈ మధ్యకాలంలో లవ్ ఎఫైర్స్ కారణంగా జరుగుతున్న నేరాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దలు ఒప్పుకోకపోవడం, ప్రేమలో మోసపోవడం వంటి కారణాలతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ మధ్యకాలంలో లవ్ ఎఫైర్స్ కారణంగా జరుగుతున్న నేరాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దలు ఒప్పుకోకపోవడం, ప్రేమలో మోసపోవడం వంటి కారణాలతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడింది.. కానీ ఆ తప్పే ఆమె ప్రాణం తీసింది!

నేటికాలంలో ప్రేమ పేరుతో జరిగే దారుణల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల తరువాత ఈ లవ్ ఎఫైర్స్ కారణంగా జరుగుతున్న నేరాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దలు ఒప్పుకోకపోవడం, ప్రేమలో మోసపోవడం వంటి కారణాలతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు అన్నీ ఎందరించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల్లో కొందరు హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ వివాహిత ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా దువక్కుడి అయ్యప్ప నగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్(30), వీరమ్మాళ్(25) అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె నర్సింగ్ గ్రాడ్యూయేట్ చేసింది. గత మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరి వేరు వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే వారిని ఎదిరించి మరీ..ప్రవీణ్, వీరమ్మాళ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. పెళ్లైన కొత్తలో వీరి సంసారం చాలా సంతోషంగా ఉంది. అయితే కొన్ని రోజుల తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు.

పెళ్లి తర్వాత నుంచి ప్రవీణ్ కుమార్ రోజూ మద్యం సేవించి ప్రేమించిన భార్యను కొట్టి వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. మద్యం తాగే అలవాటు ఉందని తెలియక చేసుకోవడమే తాను చేసిన తప్పమని భావించింది. ఈ క్రమంలోనే జూన్ 26న ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ సమయంలో వీరమ్మాళ్ సోదరుడు మాట్లాడి వారి గొడవను పరిష్కరించాడు. మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ కుమార్ భయంతో వీరమ్మాళ్ సోదరుడికి  ఫోన్ చేసి.. ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నాదని చెప్పాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన వీరమ్మలై సోదరుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే మృతురాలి భర్త ప్రవీణ్ కుమార్ దువక్కుడి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తమ మద్య జరిగిన గొడవలో క్షణికావేశానికి లోనై..ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు విచారణలో తెలిపారు. అనుమానస్పద కేసును హత్య కేసుగా పోలీసులు మార్చి ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది మహిళలు హత్యకు గురికావడం, ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి