iDreamPost
android-app
ios-app

గుంటూరు జిల్లాలో దారుణం: గొంతు కోసి వివాహిత హత్య!

తరచూ సమాజంలో మహిళలపై అనేక ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మహిళలకు రక్షణ కరువైందనే మాటలు నిజమనిపిస్తాయి. ఆడవారికి బయటనే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఓ వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది.

తరచూ సమాజంలో మహిళలపై అనేక ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మహిళలకు రక్షణ కరువైందనే మాటలు నిజమనిపిస్తాయి. ఆడవారికి బయటనే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఓ వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది.

గుంటూరు జిల్లాలో దారుణం: గొంతు కోసి వివాహిత హత్య!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర కారణాలతో ఆడవారిపై హత్యలు జరుగుతున్నాయి. అందుకే తరచూ ఘోరమైన స్థితిలో ఆడవారు హత్యకు గురవుతున్న ఘటనలను మనం చూస్తున్నాం. తాజాగా గుంటూరు జిల్లాలో  తెనాలిలో ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో రామిశెట్టి అలేఖ్య(35), రమేశ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానిక భవనం వారి వీధిలో ఈ దంపతులు నివాసముంటున్నారు. గురువారం అలేఖ్యను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి..దారుణంగా చంపేశారు. గురువారం ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడిఉన్న అలేఖ్య మృతదేహాన్ని  ఆమె భర్త రమేశ్ గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇక ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త కొన్ని కీలక విషయాలను పోలీసులకు తెలియజేశాడు.  గత కొన్నేళ్లుగా అన్నెం శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని రమేశ్ తెలిపాడు. ఈ క్రమంలోనే అతడిపై కేసులు కూడా పెట్టామని రమేశ్‌ పోలీసులకు తెలిపారు. తన భార్యను శ్రీనివాస్‌ తరచూ వేధించేవాడని, ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడని తెలిపాడు. అంతేకాక రమేశ్ దంపతులను చంపుతామని పలుమార్లు బెదిరించాడని, అందుకే అతడిపై కేసులు పెట్టామని ఆయన తెలిపాతడు. ఇదే సమయంలో శ్రీనివాస్ కి శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఇలా చేశాడని, బెదిరింపుల వరకే ఆగుతాడు అనుకున్నాం.. కానీ, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని రమేశ్‌ పోలీసులకు వివరించాడు.

గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో అలేఖ్య గొంతు కోయడంతోనే తీవ్ర గాయమై ఆమె చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే  ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఇలా వివాహిత దారుణంగా హత్యకు గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరి..ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.