Keerthi
ఓ ప్రైవేట్ సంస్థ వేసిన వలలో చిక్కుకున్న బాధితుడు బాధితుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. అయితే అతను చేసిన పనికి కడుపున పుట్టిన పిల్లలు బలైపోయారు.
ఓ ప్రైవేట్ సంస్థ వేసిన వలలో చిక్కుకున్న బాధితుడు బాధితుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. అయితే అతను చేసిన పనికి కడుపున పుట్టిన పిల్లలు బలైపోయారు.
Keerthi
ఇటీవల కాలంలో చాలామంది ఎక్కువ డబ్బులను సంపాదించి కోటీశ్వరులు అవ్వలనే ఆశతో తప్పటడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా.. లేని పోని సంస్థల్లో లాభాలను ఆర్జించాలనే దురాశతో లక్షల కొలది డబ్బులను పెట్టుబడులుగా పెడుతున్నారు. అలా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఆయా సంస్థలు మొదట లాభాల పేరిట ఆశను చూపి ఆ తర్వాత మాత్రం నిండా ముంచేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది బాధితులు లాభాల కోసం తమ సొంత డబ్బులను కొన్ని ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నదంత పొగొట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వలలోనే చిక్కుకున్న ఓ బాధితుడు దిక్కుతోచని స్థితిలో చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది. అతని చేసిన పనికి.. కడుపున పుట్టిన పిల్లలు బలైపోయారు.
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి తన ముగ్గురి పిల్లలను హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మనీ స్కీమ్‌లో వలలో చిక్కుకోని తనతో పాటు వందల మందితో పెట్టుబడులు పెట్టించి మోసపోవడంతో పాటు.. డబ్బు ఇవ్వాలని వేధింపులు తట్టుకులేక నిద్రపోతున్న తన కుమారులను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతటి విషాధ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మోకిల పోలీసు స్టేపన్ పరిధి టంగటూర్ గ్రామానికి చెందిన నీరటి రవి(35) ఓ ప్రైవేట్ ఉద్యోగి . ఇతనికి 14 ఏళ్ల క్రితం శ్రీలతతో వివాహమైంది. కాగా, వీరికి ఇప్పుడు సాయికిరణ్(13), మోహిత్ కుమారు(10), ఉదయ్ కిరణ్(7) అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే రవి ఉద్యోగంలో భాగంగా రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు వెళ్లాడు. అక్కడ జీఎస్ఎన్ ఫౌండషన్ ప్రతినిధి తిరుపతిరెడ్డితో రవికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రెండింతలకు, మూడింతలు లాభం ఇప్పిస్తానని.. అలాగే రూ.1000 కడితే నిర్ణీత గడువు తర్వాత రూ.3 వేలు , రూ. లక్ష కడితే ఆరు నెలలో రూ.6 లక్షలు ఇస్తామని నమ్మించాడు.
అయితే దీనికి ఆకర్షితుడైన రవి.. రెండేళ్ల క్రితం డబ్బు పెట్టగా మొదట లాభాలు ఇచ్చారు. దీంతో సొంతంగా రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టడమే కాకుండా.. టంగటూర్, ఇతర గ్రామాల్లోని పలువురు వ్యక్తులతో డబ్బు కట్టించాడు.ఈ నేపథ్యంలోనే సంస్థ లాభాలు ఇవ్వడంతో మరిన్ని డబ్బులు పెట్టుబడులు పెట్టారు. కానీ, అక్కడికి మూడు నెలల తర్వాత నుంచి ఆ జీఎస్ఎన్ సంస్థ లాభాలు ఇవ్వడం లేదు. దీంతో కొందరు రవి ఇంటికి వచ్చి అతడిపై ఒత్తిడి చేసేవారు. దీంతో గత 15 రోజుల కిందట రవి టంగటూరు నుంచి శంకర్ పల్లికి మకాం మార్చగా.. డబ్డు పెట్టుబడి వ్యవహారంలో తన భార్య శ్రీలతతో రవికి శనివారం గొడవ జరిగింది. దీంతో మనస్థాపనికి చకందిన రవి బలవన్మరణానికి పాల్పడాలని అతను నిర్ణయించుకున్నాడు. కాగా, ఆదివారం ఉదయం చిన్నకుమారుడు ఉదయ్ కిరణ్ ను వెంటబెట్టుకుని మొయినాబాద్ మండలం చిల్కూరులోని గురుకుల పాఠశాలకు వెళ్లాడు. అక్కడ 6,5 తరగతులు చదువుతున్న మరో ఇద్దరు కుమారులు సాయికిరణ్, మోహిత్ కుమార్ లను బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత భార్యకు పోన్ చేసి పుట్టింటికి వెళ్లాలని.. పిల్లలు టంగటూర్ లో తనతో ఉంటారని చెప్పాడు.
ఇక భార్య పుట్టింటికి వెళ్లడంతో.. అర్ధరాత్రి నిద్రపోతున్న తన కుమారులను పడుకున్నచోటే తాడుతో మెడకు ఉరి బిగించి హత్యచేశాడు. ఆ తర్వాత అతడు తాను నిర్మిస్తున్న పంక్షన్ హాల్ వద్దకు వెళ్లి రేకుల షెడ్డులో ఉరేసుకుని చనిపోయాడు.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి ఏసిపి రమణగౌడ్ వివరాలను సేకరించి కేసును నమోదు చేసుకున్నారు. అయితే.. రవి, ఇతర గ్రామస్తులు వద్ద రూ.2 కోట్లు వరకూ జీఎస్ఎన్ సంస్థకు చెల్లించాడు. కాగా, గతేడాది డిసెంబర్ నుంచి ఆ సంస్థ కార్యకలపాలు నిలిపి వేసినట్లు సమాచారం. మరి, ఓ ప్రైవేట్ సంస్థ వేసిన వలలో చిక్కుకున్న బాధితుడు ఇలా తన కుమారులను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.