iDreamPost
android-app
ios-app

అతి దారుణంగా అమ్మని చంపిన కొడుకు! ఎందుకంటే?

అతి దారుణంగా అమ్మని చంపిన కొడుకు! ఎందుకంటే?

నేటికాలంలో మనుషుల్లో మానవత్వం, రక్తబంధం అనేవి కనుమరుగవుతున్నాయి. ఎవరి స్వార్థం వారే తప్ప.. పక్కవారి పరిస్థితిని పట్టించుకునే మనుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది.  ఇంకా దారుణం ఏమిటంటే.. వృద్ధాప్యంలో చూసుకుంటారనుకునే కొడుకులే కాలయముళ్లుగా మారుతున్నారు. ఆస్తులు, అంతస్తుల కోసం కన్నవారిని చంపే కాసాయి కొడుకుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా పెళ్లి చేయడం లేదని కన్న తల్లిని ఓ కుమారుడు దారుణంగా చంపేశాడు. ఈ దారుణం ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45) కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆమె భర్త పదిహేనళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె శైలజకు వివాహం చేసి అత్తగారింటికి పంపింది. ఇక కుమారుడు ఈశ్వర్ తో కలిసి ఆమె నివాసం ఉంటుంది. పాత  ఇనుప సామాగ్రి విక్రయాలు చేస్తూ వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తోంది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఈశ్వర్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో తొలగించారు. ఒక చేయి లేకపోవడంతో అతడికి పెళ్లి కావడం లేదు. దీంతో తనకు పెళ్లి సంబంధాలు చూడమని తరచూ తల్లితో  చెబుతుండే వాడు. ఆమె కూడా ఎంత ప్రయత్నించిన ఈశ్వర్ కి సంబంధాలు దొరకడం లేదు.

ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో తల్లీ కొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసగా మారిన ఈశ్వర్..తన తల్లిపై కోపం పెంచుకున్నాడు. ఆమెను  చంపేయాలని తన దూరపు బంధువైన పర్వతం రాముతో కలిసి ప్లాన్ వేశాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై పదునైన ఆయుధంతో గొంతును కోశారు.  హత్య చేసిన విషయం తమపైకి రాకుండా ఉండటానికి  మరో పథకం వేశారు. ఆమె రెండు కాళ్లు నరికేశారు. కాళ్లకు ఉన్న కడియాలు తీసి దాచిపెట్టారు.

దొంగలు వచ్చి.. కడియాల కోసం తల్లిని చంపారని ఈశ్వర్.. సోదరికి శైలజకు సమాచారమిచ్చాడు. ఆమె  వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించారు.  ఘటన తీరు, ఈశ్వర్ ప్రవర్తనలో తేడా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలో పోలీసులు ప్రశ్నించగా ఈశ్వర్ అసలు నిజం చెప్పాడు. మరి.. పెళ్లి,ఆస్తులు, డబ్బుల కోసం కన్నవారిని హత్య చేస్తున్న ఇలాంటి కసాయి కొడుకులకు ఎలాంటి శిక్షవిధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet