iDreamPost
android-app
ios-app

అసహజ లైంగిక చర్యకు ఒప్పుకోలేదని స్నేహితుడి దారుణ హత్య!

ఈ మధ్యకాలంలో చిత్రవిచిత్రమైన నేరాలు, ఘోరాలు వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమ్మాయిలపై లైంగిక దాడులు,హత్యలు జరిగిన ఘటనలు ఎక్కువగా చూశాం. తాజాగా ఓ స్నేహితుడిని లైంగిక చర్యకు ఒప్పుకోలేదని దారుణంగా హత్య చేశారు.

ఈ మధ్యకాలంలో చిత్రవిచిత్రమైన నేరాలు, ఘోరాలు వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమ్మాయిలపై లైంగిక దాడులు,హత్యలు జరిగిన ఘటనలు ఎక్కువగా చూశాం. తాజాగా ఓ స్నేహితుడిని లైంగిక చర్యకు ఒప్పుకోలేదని దారుణంగా హత్య చేశారు.

అసహజ లైంగిక చర్యకు ఒప్పుకోలేదని స్నేహితుడి దారుణ హత్య!

ఇటీవల కాలంలో ఎన్నో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అసలు సమాజం ఎటువైపు వెళ్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. లైంగిక కోరికలు తీర్చలేదని అమ్మాయిలపై దాడులు, హత్యలు జరిగిన ఘటనలు చాలానే జరిగాయి. కానీ..తాజాగా ఓ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తమ స్నేహితుడు అసహజ లైంగిక చర్యకు ఒప్పుకోలేదని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ హత్య రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్​  రాష్ట్రంలోని బరణ్​ జిల్లాలో మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్​,  ఓం ప్రకాశ్​ బైర్వాల అనే ముగ్గురు స్నేహితులు నివాసం ఉంటున్నారు. వీరిలోని 32 ఏళ్ల ప్రజాపతికి రోడ్డు పక్కన ఓ డాబా ఉంది. యాదవ్​ ఓ రోజువారీ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 10 రోజుల క్రితం.. ప్రజాపతి, యాదవ్​, భైర్వాలు కలిసి మద్యం సేవించారు. అనంతరం సమీప గ్రామంలో ప్రజాపతి సోదరి ఉంటుంది. ఆమెను చూసేందుకు ప్రజాపతి, అతడి స్నేహితులు ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ చాలా సమయం గడిపిన అనంతరం తిరిగి వాళ్ల ఇళ్లకు వస్తున్నారు.

మార్గం మధ్యలో ప్రజాపతి, సురేంద్ర యాదవ్​లు.. భైర్వాని ఆపి, తమతో తమతో అసహజ సె*క్స్​ చేయాలని అడిగారు. వారు అన్నమాటలకు భైర్వా కాసేపు షాక్ గురయ్యాడు. అంతేకాక ఆ స్నేహితులు  ఇద్దురు చెప్పిన పనికి భైర్వా ఒప్పుకోలేదు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు ఆగ్రహానికి గురయ్యారు.  మద్యం మత్తులో భైర్వాని దారుణంగా కొట్టారు. లైంగిక చర్యకు ఎంతకీ అంగీకరించకపోవడంతో.. అతికిరాతకంగా పొడిచి, పొడిచి చంపేశారు. అనంతరం సమీపంలోని ఎండిపోయినా  చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 26న బరణ్​ సిటీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో భైర్వా మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ అసలు విషయం బయటపడింది. ఈ ఘటన గురించి బరన్ జిల్లా ఎస్పీ రాజ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. సాంకేతిక దర్యాప్తు, విచారణల ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌ల్లో ప్రజాపతిని అరెస్టు చేసినట్లు అధికారి వివరించారు. ప్రాథమిక విచారణలో బైర్వాను హత్యచేసినట్టు ప్రజాపతి అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  మరి..ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.