Arjun Suravaram
ఇటీవల కాలంలో ఆడవారు అదృశ్యమవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాలేజికి, ఆఫీస్ కి, పొలాలకు వెళ్లిన మహిళు కనిపించకుండా పోతున్నారు. తాజాగా ఓ మహిళ ఒంటరిగా పొలంకి వెళ్లింది. కానీ తిరిగొచ్చే దారిలో దారుణం జరిగింది.
ఇటీవల కాలంలో ఆడవారు అదృశ్యమవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాలేజికి, ఆఫీస్ కి, పొలాలకు వెళ్లిన మహిళు కనిపించకుండా పోతున్నారు. తాజాగా ఓ మహిళ ఒంటరిగా పొలంకి వెళ్లింది. కానీ తిరిగొచ్చే దారిలో దారుణం జరిగింది.
Arjun Suravaram
నేటికాలంలో మనిషి ప్రకృతిని విపరీతంగా నాశనం చేస్తున్నాడు. అందుకే చర్యకు ప్రతి చర్య అన్నట్లు పర్యావరణం కూడా మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇలా కేవలం ప్రకృతి నుంచి విపత్తుల ద్వారానే కాకుండా, భూమి మీద జీవించే జీవుల విషయంలోనూ ఇదే జరుగుతుంది. అందుకే అడవి మృగాలు ఊర్లపైకి రావడం, కుక్కలు మనిషి మాంసం కోసం ఆరాట పడటం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కుక్కల దాడిలో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది మృతి చెందారు. తాజాగా ఓ మహిళపై 20 కుక్కలు దాడి చేసి.. ముక్కలు ముక్కలుగా చేశాయి. ఈ ఘోర ఘటన ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
పంజాబ్ రాష్ట్రం కపూర్తలా జిల్లాలో సుల్తాన్ పూర్ లోదీ ప్రాంతంలో పారీ దేవి(32)అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. వారి కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఇక పారీ దేవి..పశువులను మేపుతూ.. కుటుంబానికి చేయుతగా ఉంటుంది. అలా పశువుల పోషణ ద్వారా వచ్చిన ఆదాయంతో వారి కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. ఆమె నిత్యం సుల్తాన్ పూర్ లోధీ ప్రాంతంలో పశువులను మేపుకుని ఇంటికి తిరిగి వస్తుంది. అలానే రోజూ మాదిరిగానే మంగళవారం సాయంత్రం కూడా పశువులను మేపేందుకు పారీదేవి పొలాలకు వెళ్లింది.
ఇక సాయంత్రం సమయంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో ఆమె ఆందోళనకు గురైంది. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికి అవి చుట్టు ముట్టి ఆమెను దారుణంగా చంపేశాయి. మరోవైపు చీకటి పడిన భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త చుట్టుపక్కల వెతికాడు. అలానే తన బంధువుల ఇళ్లకు కూడా ఫోన్లు చేసి సమాచారం ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. ఇలా ఎక్కడా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త నుంచి వివరాలు సేకరించారు.
బుధవారం పారీ దేవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ ప్రాంతంలో ఆమె మృతదేహం ముక్కలుగా పడి ఉంది. అనంతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి..కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలానికి వెళ్లిన తన భార్య..విగత జీవిగా మారడంతో మృతురాలి భర్త కన్నీరు మున్నీరు అయ్యారు. కుక్కల దాడిలో సంభవిస్తున్న మరణాల సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలపై కుక్కలు దాడి చేసిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలో హైదరాబాద్ లో ఓ పసిబాబుపై వీధి కుక్కలు దాడి చేసి దారుణంగా చంపేశాయి. మరి.. ఇలాంటి ఘటనలకు పరిష్కారం ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.